అది నేను కాదు.. ఆ పాత ఫోటోపై  అన్నాలెజినెవా క్లారిటీ

Spread the love

సినీ ప్రపంచంలో స్టార్‌గా, రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్  గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఆయన సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాదు… వ్యక్తిగత జీవితం కూడా ఫ్యాన్స్‌కి ఎంతో ఆసక్తి  ఉంటుంది. ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజ్ నోవా గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని ఆమె, ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి  ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సోషల్ మీడియాలోకి వచ్చిన తరువాత అన్నా చిన్న చిన్న విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా ఆమె ఎంతో సహజంగా సమాధానాలు ఇస్తుండటం ఆమెను అభిమానులకు మరింత దగ్గర చేస్తోంది. ఈ క్రమంలో  చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పాత ఫోటో గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటో ‘తీన్మార్’ సినిమా సమయంలో తీసినదిగా చెబుతారు. అందులో పవన్ కళ్యాణ్ పక్కన ఒక విదేశీ మహిళ కూర్చుని ఉండడం కనిపిస్తుంది. ఈ ఫోటోను చూసిన చాలా మంది, “ఇది అన్నా లెజినోవానే” అని భావిస్తూ, సోషల్ మీడియాలో సంవత్సరాలుగా షేర్ చేస్తూ వచ్చారు. అయితే, వీటన్నింటికీ  ఇప్పుడు అన్నా లెజినోవా స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ ఫోటోను తన స్టోరీలో షేర్ చేస్తూ అందులో ఉన్నది తాను కాదని స్పష్టంగా తెలిపారు. ఆ మహిళ అమెరికాకు చెందిన నటి డానా మార్క్స్ అని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *