ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ తో ప్రధాని మోడీ నేడు భేటీ అయ్యారు. వీరిరువురి మధ్య చాలా ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు మోడీ పేర్కొన్నారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూరప్ వెలుపల సందర్శించిన మొదటి దేశంగా భారత్ ను ఎంచుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇది భారత్-ఆస్ట్రియా సంబంధాల పట్ల ఆయనకున్న దార్శనికతను మరియు నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. చారిత్రాత్మకమైన భారత్-ఈయూ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన జరగడం భారత్-ఈయూ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. నవకల్పన, మౌలిక సదుపాయాలు మరియు స్థిరత్వం వంటి రంగాలలో సహకారాన్ని మరింత పటిష్టం చేసే మార్గాలపై నేడు చర్చలు సాగాయన్నారు. వాణిజ్యం మరియు ఇన్వెస్ట్మెంట్స్ లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రక్షణ, సెమీకండక్టర్లు, భవిష్యత్ సాంకేతికతలు మరియు స్టార్టప్‌ల వంటి రంగాలు సన్నిహిత సంబంధాలకు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయన్నారు. భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యం మరింత ఆవిష్కరణల కేంద్రంగా మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మారుతుందని ఆకాంక్షించారు.