అభ్యుదయకరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం మరియు అందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించే మార్గంలో తమిళనాడు భారతదేశానికే దిక్సూచిగా నిలిచిందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ నెల 23న తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నమూనాను మరింత బలోపేతం చేసేందుకు, తమిళనాడు కోసం 6 గ్యారెంటీలను ప్రకటిస్తున్నామన్నారు. మహిళలకు నెలకు రూ.2,000.వృద్ధులకు మరియు దివ్యాంగులకు నెలకు రూ.2,000.కళాశాల విద్యార్థులకు నెలకు రూ.2,000 స్కాలర్షిప్. ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రతి కుటుంబానికి నెలకు రూ. 2,500. ప్రభుత్వ ఖాళీల భర్తీ 300 రోజుల్లో పూర్తి + స్థానికులకు 60% రిజర్వేషన్ (గ్రూప్ C & D ఉద్యోగాల్లో).మొదటిసారి ఆస్తి కొనుగోలు చేసే మహిళలకు ఉచిత రిజిస్ట్రేషన్ వంటి కీలక హామీలను వివరించారు. బీజేపీ చేస్తున్న దాడులను ఎదుర్కొంటూ, తమిళనాడు అస్తిత్వాన్ని, సంస్కృతిని మరియు అక్కడి ప్రజలను రక్షించడానికి INDIA కూటమి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.