మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడలేదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ ప్లాన్స్ చెల్లలేదన్నారు. ప్రజాస్వామ్యం నిలబడిందిని ఇది భారత దేశ ప్రజల విజయమని పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ దురుద్దేశ్యానికి ఇది నిజంగా చరమ గీతమని మహిళల పేరుతో నీచ రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీజీకి బీజేపీకి ఇది చెంపపెట్టు అని పేర్కొన్నారు. వీగిపోయింది అతి గతి లేని డీ లిమిటేషన్ బిల్లే తప్పా మహిళా బిల్లు కాదని అన్నారు. విపక్షం ఎన్నడూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నారీ పేరుతో తెచ్చింది డీ లిమిటేషన్ బిల్లు మాత్రమే. ఇవ్వాళ వీగిపోయింది నియోజక వర్గాల పునర్విభజన బిల్లేనని పేర్కొన్నారు. 2023 లోనే మహిళా బిల్లుకు ఆమోదం దక్కిందన్నారు. ప్రతిపక్షాలపై బురదజల్లడం మాని ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 తక్షణం అమలు చేయాలన్నారు. బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉందన్న మాటను నిరూపించుకోవాలి. 543 స్థానాలకు వెంటనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.