దేశాభివృద్ధిలో సిక్కిం సహకారం గర్వకారణం:ప్రధాని మోడీ

Spread the love

ప్రధాని నరేంద్ర మోడీ సిక్కింలో పర్యటిస్తున్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సిక్కిం ప్రజలు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు ఎనలేనివని కొనియాడారు. సిక్కిం రాష్ట్రానికి ఎకో-వెల్నెస్ (పర్యావరణ అనుకూల ఆరోగ్య) పర్యాటక రంగంలో అపారమైన సామర్థ్యం ఉందని  దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దీనిని కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సిక్కిం యువత క్రీడల పట్ల ఎంతో మక్కువ కలిగి ఉన్నారని మైదానంలో తమ ప్రతిభను కూడా చాటుకున్నారన్నారు.  వారికి మెరుగైన వసతులు, రాణించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులపై పని చేస్తోందని తెలిపారు.  నేడు ప్రపంచమంతా స్థిరమైన జీవనశైలి (sustainable lifestyles) గురించి మాట్లాడుతోంది. మన ఈశాన్య భారతం, ముఖ్యంగా సిక్కిం, దీనికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గ్యాంగ్‌టక్‌లో సిక్కిం సాంస్కృతిక వారసత్వాన్ని వీక్షించడం  మరపురాని అనుభూతిని ఇచ్చిందన్నారు.  ఒకే కార్యక్రమంలో భారతదేశం మొత్తం ఒక్కటైనట్లు అనిపించిందని  ఆ అద్భుత ప్రదర్శనలు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు అద్దం పట్టాయన్నారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. గ్యాంగ్‌టక్‌లోని ఉత్సాహం ప్రజలు చూపిన అభిమానం సరికొత్త శక్తిని నింపాయిన్నారు.  దేశాభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం పట్ల భారతదేశం ఎంతో గర్విస్తోందన్నారు. సిక్కిం ప్రజలు పలు రంగాల్లో రాణించడమే కాకుండా, వారి అద్భుతమైన స్వభావంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. ఇక ప్రధాని మోడీ గ్యాంగ్‌టక్‌ లోని ఆర్కిడారియంను సందర్శించారు. ఇక నేటి ఉదయం ప్రధాని మోడీ ఫుట్‌బాల్‌ ఆడారు.స్థానిక క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *