‘పెద్ది’ ప్రత్యేక గీతంలో శృతి హాసన్ 

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.  భారీ నిర్మాణ విలువలతో, టెక్నికల్‌ గా హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్  టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సాంకేతికంగా కూడా ‘పెద్ది’ ఒక గ్రాండ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్  సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు  కెమెరా బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా  వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో రానుంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే, ‘పెద్ది’ మూవీలో  స్పెషల్ ఐటెం సాంగ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఒక పక్కా మాస్ సాంగ్ ఉంటే సినిమాకు మరింత బూస్ట్ వస్తుందని భావించిన దర్శకుడు బుచ్చిబాబు, ఈ పాటను ప్రత్యేకంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. శృతి హాసన్ ఈ ప్రత్యేక గీతంలో చరణ్ తో డ్యాన్స్ చేయనున్నారని తెలుస్తోంది.  ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే శృతి హాసన్‌కు మాస్ సాంగ్స్‌లో మంచి అనుభవం ఉంది. ఆమె డ్యాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక రామ్ చరణ్, శృతి హాసన్ జంట గురించి చెప్పాలంటే, వీరిద్దరూ గతంలో ‘ఎవడు’ సినిమాలో కలిసి నటించారు. అప్పట్లో వారి కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ స్పెషల్ సాంగ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *