కింగ్ 100లో సీనియర్ నటి టబు

Spread the love

సీనియర్ అగ్రకథానాయకుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నాగార్జునకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.అభిమానులకు కూడా ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలున్నాయి.  ఈ సినిమాను తమిళ దర్శకుడు Ra కార్తీక్  తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా భాగమైనట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నిర్మాణ సంస్థ  ఆమెకు స్వాగతం పలుకుతూ ఆమె ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా కావడం సంతోషకరమని తెలిపింది. నాగార్జున టబు ల జోడీకి కు హిట్ పెయిర్ గా మంచి పేరుంది.  ‘సిసింద్రీ’, ‘నిన్నే పెళ్లాడతా’ తదితర చిత్రాల్లో నాగ్ సరసన అలరించిన ఆమె ఈ ప్రతిష్టాత్మక సినిమాలో కూడా భాగం కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. చాలా కాలం తర్వాత నాగార్జున – టబూ జంట మళ్లీ తెరపై కనిపించబోతున్నదన్న వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా నిర్మాణం విషయానికి వస్తే, నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ ప్రాజెక్ట్‌ ను స్వయంగా ప్రొడ్యూస్ చేయడం ఆయనకు ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో చూపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరా సీజన్‌లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం మాములే. ఆ టైంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *