దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా ‘ధురంధర్ 2’రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇక ఓటీటీ లోకి రానున్నట్లు అప్డేట్ వచ్చేసింది. మే 14 నుండి ఓవర్సీస్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అన్కట్ వెర్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 3.52 గంటల నిడివితో ‘ధురంధర్: ది రివెంజ్ను డిజిటల్ ప్రేక్షకులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఇండియాలో జియోహాట్ స్టార్ వేదికగా ఇది ప్రేక్షకులను అలరించనుంది. మే 15 నుండి ఇక్కడి ప్రేక్షకులకు ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. జియో హాట్ స్టార్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. రెండు పార్ట్ లు కూడా ఒక దానిని మించి ఒకటి భారీ హిట్స్ గా నిలిచాయి. యాక్షన్ ఎపిసోడ్స్, కథ కథనం నటీ నటుల యాక్టింగ్ మొత్తంగా ధురంధర్ సిరీస్ భారతీయ సినిమాలలోనే భారీ హిట్ గా ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. సారా అర్జున్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీ, గౌరవ్ గెరా, డానిష్ పండార్, అక్షయ్ ఖన్నా ఇలా ఎవరి పాత్రల్లో వారు జీవించేశారు. ప్రతి పాత్రను కథకు కనెక్ట్ చేసిన విధానం దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ప్రేక్షకులు ఆసాంతం సినిమాను ఆస్వాదించేలా రూపొందించారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల ఎమోషన్స్ ను కదిలించేలా తీర్చిదిద్దారు. మొత్తంగా ఈ చిత్రంలోని భావోద్వేగాలు మరియు నటీనటుల ప్రతిభ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. కథానాయకుడి పాత్రలో కనిపించే తెగువ, ధైర్యం మరియు దేశం పట్ల ఉండే నిబద్ధత ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. ఇలా ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండడంతో మరోసారి ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.