మయన్మార్ లో లభ్యమైన 2.2కేజీల భారీ రూబీ

Spread the love

భారీ రూబీ మయన్మార్ లో దొరికింది. మయన్మార్‌లోని మాండలే రీజియన్‌లో “వ్యాలీ ఆఫ్ రూబీస్” (కెంపుల లోయ) అని పిలువబడే మొగోక్‌ లో ఇటీవల ఈ కెంపు కనుగొనబడింది. 11వేల క్యారెట్ల అంటే కేజీలలో చెప్పాలంటే 2.2కేజీలు. ఇక ఈ భారీ కెంపును గుర్తించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. ఇలా దొరకడాన్ని అరుదని పేర్కొన్నారు. మయన్మార్ లోని మొగాక్ ప్రాంతానికి ‘వ్యాలీ ఆఫ్ రూబీస్’ గా చెప్తారు. ఇక్కడ 1990లో 496 క్యారెట్లు, 1996లో 21,450 క్యారెట్లు, 2022లో 2,789 క్యారెట్ల బరువున్న ఇటువంటివి లభించాయి. 1996లో దొరికిన 21,450 క్యారెట్ల కెంపు కంటే ఇది పరిమాణంలో చిన్నదైనప్పటికీ, దీని అద్భుతమైన రంగు మరియు గ్రేడ్ కారణంగా ఇది మునుపటి వాటన్నింటికంటే అత్యంత విలువైనదిగా పరిగణించబడుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *