దుర్గమ్మ సన్నిధిలో ఏపీ మంత్రి నారా లోకేష్

Spread the love

ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువైయున్న కనకదుర్గ  అమ్మ వారిని దర్శించుకున్నారు.దేవాదాయ కమీషనర్ రాంచంద్రమోహన్,ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధా కృష్ణ  ఆయనకు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అమ్మ వారి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు.  అమ్మ వారిని దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం కల్పించి అమ్మ వారి చిత్రపటాన్ని,అమ్మ వారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు లోకేష్ కు అందించారు. ఆలయ అభివృద్ధి గురించి ఆలయ అధికారులను అడిగి  లోకేష్ అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మ వారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులకు లోకేష్ సూచించారు. ఇక అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగిన ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డా.వేమూరు రవి కుమార్ కుమారుడి వివాహ వేడుకలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. నూతన వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *