ఈ నెల 18న టీటీడీ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Spread the love

టీటీడీ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగష్టు నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు రిజిస్టర్  చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుండి  22వ తేదీ మధ్యాహ్నం లోపు నగదు చెల్లించినచో  టికెట్లు మంజూరవుతాయి. ఈనెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు విడుదల చేయనున్నారు.  వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా అందుబాటులో ఉండనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఫ్రీ స్పెషల్ ఎంట్రీ దర్శన కోటా విడుదలవుతుంది. 25న ఉదయం 10 గంటలకు స్పెషల్ ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు రూమ్ రెంట్  బుకింగ్ కోటా విడుదల చేయనున్నారు.  భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *