ఏపీ ప్రభుత్వం పొదుపు మంత్రం…క్యాబినెట్ లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Spread the love

దేశం కోసం పొదుపు చర్యలు పాటిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు ఆయన అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోడీ సూచించిన పొదుపు సూచనలపై ప్రధానంగా చర్చించారు. ‘నా దేశం-నా బాధ్యత’ పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెబుతూ పలు సూచనలు చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాలు తగ్గించుకుంటే చాలదని ఇతర మార్గాలూ అన్వేషించాలన్నారు. జిల్లా పర్యటనల్లో ఖర్చులతో పాటు విదేశ పర్యటనలూ తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై ఫోకస్ చేయాలని ఇంటి నుండి పనిచేసే విధానంపై స్టడీ చేసి రూట్ మ్యాప్  రూపొందించాలన్నారు. సోలార్ ఎనర్జీని భారీ స్థాయిలో అందిపుచ్చుకోవాలని తెలిపారు. మనకెంతో ఇచ్చిన దేశానికి కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందన్నారు. ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా ఇంప్లిమెంట్ చేద్దామని  డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సూచించారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణయానికీ ప్రజలను రెడీ  చేసిన తర్వాత ప్రకటన చేద్దామని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *