‘ఇరుముడి’లో ఆ సాంగ్ గురించి నెటిజన్ల ఆసక్తి

Spread the love

ఎనర్జీ, కామెడీ, మాస్ డైలాగులు, పవర్‌ఫుల్ యాక్షన్ తో అన్ని రకాల ప్రేక్షకులకు చేరువైన నటుడు మాస్ మహారాజ్ అని అభిమానులు పిలుచుకునే స్టార్ రవితేజ. అయితే గత కొంతకాలంగా రవితేజ తన సినిమాల ఎంపికలో మార్పు తీసుకొస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే తరహా సినిమాలు కాకుండా, కథలో కొత్తదనం ఉండే ప్రాజెక్టులను ఎంచుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రవితేజ.  ఇప్పుడు మరోసారి పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకు రవితేజ చేయని తరహా పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ముఖ్యంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు కొత్తదనాన్ని ఫీల్ అయ్యారు.  ఎందుకంటే రవితేజ నుంచి ఇలాంటి డిఫరెంట్ మూవీ ఎవరూ ఊహించలేదు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి లవ్ స్టోరీలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. ఈసారి పూర్తిగా కొత్త కథను ఎంచుకున్నారు. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాల వేసుకునే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ మాల ధరించి కనిపించిన తీరు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కలిగించింది. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం పాటల గురించే. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంలో సినిమా ఉండటంతో సంగీతానికి ఇందులో చాలా పెద్ద ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా మాలధారణ సమయంలో అయ్యప్ప స్వాములు పాడుకునే ప్రసిద్ధ భక్తి గీతాలు సినిమాలో వినిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఈ మూవీ ఆల్బమ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ముఖ్యంగా ‘విల్లాది వీరుడు.. వీరమణి కంఠుడు’ అనే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో అయ్యప్ప స్వామి భక్తులకు ఈ పాట ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్  సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ‘విల్లాది వీరుడు.. వీరమణి కంఠుడు’ అనే లైన్స్ రాస్తూ ఫైర్ ఎమోజీతో ట్వీట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహపడిపోయారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు, రవితేజ అభిమానులు ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్  నటిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *