ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రేక్షకులలో క్రేజ్ కొనసాగుతోంది. ఆదరణ తగ్గలేదు. ఎంటర్టైన్మెంట్ లో ఎన్ని దారులు ఉన్నా ఇతర వినోద కార్యక్రమాలను అధిగమించి మరీ భారీ ప్రేక్షకాదరణ నమోదవుతూనే ఉంది. ఈ లీగ్ స్టాటిస్టిక్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యూయర్షిప్ సాధించి సత్తా చాటింది. ఈ సీజన్ లోనే ఈ రేంజ్ వ్యూస్ సాధించడం విశేషం. టీవీ, డిజిటల్ వ్యూస్ లో భారీ పెరుగుదల కనిపించింది. రెండు ప్లాట్ఫామ్ ల్లో 1.1 బిలియన్ వ్యూస్ సాధించినట్లు జియో హాట్ స్టార్ తెలిపింది. టీవీ వీక్షణాల్లో 50 కోట్లతో రికార్డ్ సృష్టించింది. ఇటు డిజిటల్ గా కూడా 15 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు జియో వెల్లడించింది. ఇందులో మ్యాచ్లను వీక్షించిన సమయం 7 శాతం పెరిగినట్లు పేర్కొంది. అటు ప్రాంతీయ భాషల్లోనూ 42 శాతం పెరిగింది. ఇంకా ముందు ముందు ఈ టోర్నీ రసవత్తరంగా సాగనున్న నేపథ్యంలో ఇంకా వ్యూస్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రేక్షకులను ఐపీఎల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటోందో ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సీజన్ లీగ్ స్టేజ్లో ఇంకా 12 మ్యాచులు ఉన్నాయి. ఆతర్వాత ప్లే ఆఫ్, ఎలిమినేటర్,ఫైనల్ లకు ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయో అని అంచనాలున్నాయి.