‘పెద్ది’ నుండి మరో అప్డేట్…రామ్ బుజ్జిగా అదరగొట్టనున్న దివ్యేందు

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ వచ్చే నెల 4న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా నుండి వచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్ ను మరింత జోష్ లో ముంచెత్తుతున్నాయి. ఇటీవలే కీలక పాత్రలో నటిస్తున్న శివరాజ్ కుమార్ పాత్రకు సంబంధించిన వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. ‘గౌర్నాయుడు’ అనే పవర్‌ఫుల్ పాత్రలో శివరాజ్‌కుమార్ కనిపించగా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా మరో పాత్రకు చెందిన వీడియోను మూవీ టీమ్ పంచుకుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ‘మున్నా బాబు’ గా దేశవ్యాప్తంగా అందరిని ఆకట్టుకున్న దివ్యేందు శర్మ ‘పెద్ది’లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేడు ఆయన పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేశారు. రామ్ బుజ్జిగా దివ్యేందు ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి ఉన్న షాట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి 

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలో కనిపించిన విజువల్స్ సినిమాపై భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, సమర్పకులుగా వ్యవహరిస్తుండటం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఇప్పటికే భారీ సినిమాలు నిర్మించి విజయాలు అందుకున్న ఈ సంస్థలు ‘పెద్ది’ని కూడా అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ‘పెద్ది’ ట్రైలర్‌పైనే ఉంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో భారీ స్థాయిలో నిర్వహించే గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *