సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ గురించి టాక్ రాగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఆ హీరో, ఈ దర్శకుడు సినిమా చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ల కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందా అని ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయికి చేరతాయి. అలాంటి డ్రీమ్ కాంబినేషన్స్‌లో అపజయమెరుగని స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ గా మారిన రాజమౌళి పేరు ముందువరుసలో ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న వారణాసి సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజమౌళి తన సినిమాలతో హీరోలకు పాన్ ఇండియా స్థాయికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిందో అందరికీ తెలుసు. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే స్థాయిలో మహేశ్ బాబుకు అంతర్జాతీయంగా క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం భారీ సినిమాలతో జోరుమీదున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. కెరీర్ ప్రారంభం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కో సినిమాతో తన ఇమేజ్ను పెంచుకుంటూ వచ్చాడు. ఆర్య, దేశముదురు, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘పుష్ప’ సినిమా ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో బన్నీ చూపించిన నటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం టాలీవుడ్‌కు గర్వకారణంగా మారింది. అక్కడితో ఆగకుండా పుష్ప 2 సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఆ సినిమా విడుదల తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు,అంతర్జాతీయంగా అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రాకా అనే భారీ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరింత ఆసక్తికరమైన చర్చ ఏంటంటే… ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్, రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశముందనే టాక్. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. ఎందుకంటే రాజమౌళి విజన్‌కు, అల్లు అర్జున్ ఎనర్జీ కలిస్తే వేరే రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రాజమౌళి పూర్తి ఫోకస్ వారణాసి సినిమాపైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆయన మరో ప్రాజెక్ట్ గురించి అధికారికంగా మాట్లాడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా తన ప్రస్తుత కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ ఈ కాంబినేషన్ గురించి వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. చూద్దాం ముందు ముందు నిజంగానే అల్లు అర్జున్-రాజమౌళి సినిమా వస్తే సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేకపోయినా ఈ డ్రీమ్ కాంబినేషన్ కోసం అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.