మెగా 158 అప్డేట్…ఫిట్ నెస్ తో ఫ్యాన్స్ ను థ్రిల్ చేసిన మెగాస్టార్

Spread the love

ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఎవరైనా ఈ ఏజ్ లో కూడా యువ హీరోలకు పోటీ ఇచ్చే వేగంతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఈ సీనియర్ అగ్ర కథానాయకుడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ మెగా హిట్ ను కొట్టిన ఆయన ప్రస్తుతం ‘విశ్వంభర’, బాబీ దర్శకత్వంలో 158వ తెరకెక్కుతున్న సినిమా అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. కాగా, మెగాస్టార్-బాబీ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అయితే ఊరికే అప్డేట్ పంచుకుంటే ఆయన మెగాస్టార్ ఎందుకవుతారు. ఈ సినిమా కోసం చిరు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. లుక్ కోసం జిమ్ లో వ్యాయామాలు చేస్తూ తనను తాను ఎప్పటిలాగే కొత్తగా మార్చుకునేందుకు కష్టపడుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను మెగాస్టార్ పంచుకున్నారు. ఈ వయసులో కూడా బాస్ అసలు తగ్గట్లేదు అంటూ మెగా ఫ్యాన్స్ ఆయనను చూసి ఇదే కదా బాస్ ను చూస్తే కలిగే ఇన్స్పిరేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను kvn ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్.కె.నారాయణ్ నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ హిట్ ను అందుకుంది. ఇక ఈ సారి అంతకు మించిన పవర్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ తో సినీ ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *