మెగా 158 నుండి సూపర్ అప్డేట్…’కాకా’ గా అదరగొట్టనున్న మెగాస్టార్ 

Spread the love

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Mega158 సినిమా నుంచి ఎట్టకేలకు అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రతి ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మేకర్స్ భారీ సర్‌ప్రైజ్ సిద్ధం చేశారు. నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ ఒక్క ప్రకటనతోనే సోషల్ మీడియాలో Mega158 మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండగ వాతావరణం నెలకొంటుంది. కొత్త పోస్టర్లు, టీజర్లు, టైటిల్ అనౌన్స్‌మెంట్లు వస్తాయనే ఆశతో ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈసారి కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ కొల్లి. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన బాబీ, ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో మరో సినిమా చేస్తుండడంతో మరింత నమ్మకాన్ని పెంచింది.  తాజాగా విడుదల చేసిన వీడియోలో మెగాస్టార్ వింటేజ్ మూవీస్ ను గుర్తుచేస్తోంది. పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ మోడ్ తో కనిపించిన మెగాస్టార్‌ను చూసిన తర్వాత ఈసారి ఏదో కొత్తగా ఉండబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ వీడియోలో టైటిల్ ను  ‘కాకా’గా ఖరారు చేసింది. చిరంజీవి సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ చిత్రంలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలో కూడా ఈ సినిమా బలంగా కనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను విజయ్ కార్తీక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక దశాబ్దాలుగా తన నటనతో ఆకట్టుకుంటున్న మెగాస్టార్ జెన్ జీ తరంలో కూడా వరుస సినిమాలతో యువ హీరోలకు ధీటుగా దూసుకుపోతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *