తెలుగు సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న #King100 అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించికీలక అప్డేట్ వచ్చేసింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్ టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రం బృందం నేడు అప్డేట్ ను అభిమానులతో పంచుకుంది. బర్త్ డే గ్లిమ్ప్స్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా అగ్రహీరోలలో ఒకరిగా నాగార్జున వెలుగొందుతున్నారు. ఆయన నటించిన చిత్రాలు ఎన్నో విజయాలు సాధించి, ప్రేక్షకులను అలరించాయి. మరి, ఇప్పుడు ఆయన 100వ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక మైలురాయి సినిమా ఎలా ఉండబోతుంది అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.తన తండ్రి, దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని 1986లో “విక్రమ్” సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘శివ’, ‘గీతాంజలి’, ‘అన్నమయ్య’ ఇలా ఎన్నో సినిమాల్లో వేటికవే ప్రత్యేకంగా నిలిచే పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా, ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ఆయన రాణిస్తున్నారు. తన అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎందరో కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.నాగార్జున 100వ సినిమాపై కేవలం అభిమానులకే కాదు, ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉంది. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ఇది ఒక పండుగలాంటి విషయం. ఒక హీరో 100 చిత్రాల మైలురాయిని చేరుకోవడం తెలుగు సినిమా చరిత్రలో విశేషం. మొత్తంగా, నాగార్జున 100వ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నాగార్జున తన శతచిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంటారని ఆశిద్దాం. ఇది ఆయన కెరీర్లోని ఒక చిరస్మరణీయ చిత్రం అవుతుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.