100 శాతం అక్షరాస్యత దిశగా వేగంగా అడుగులు వేస్తోన్న ఆంధ్రప్రదేశ్

Spread the love

ఆంధ్రప్రదేశ్ 100 శాతం అక్షరాస్యత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదికవుతోంది. చూస్తూ ఉండండి, మన రాష్ట్రం ఇప్పుడు చదువుల బాటలో చారిత్రక మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతోంది. అసలు విషయం ఏమిటంటే, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని నూటికి నూరు శాతానికి చేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. లరాబోయే కాలంలో ఈ ప్రయాణం మరింత వేగవంతం కానుంది. సెప్టెంబర్ 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలనే గట్టి పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఇరవై ఐదు లక్షల మందికి చదువు చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన సుమారు ఇరవై ఏడు లక్షల మందిని కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, నిర్దేశిత గడువులోగా వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా నిలవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే రోజుల్లో సమాజంలో అసమానతలను తొలగించడంలో విద్య ఒక్కటే బలమైన ఆయుధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఈ లక్ష్యం నెరవేరితే ఏపీ దేశానికే రోల్ మోడల్‌గా నిలవడం ఖాయం. అక్షరాంధ్ర విజయంతో రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, భావి తరాలకు బంగారు భవిష్యత్తు దొరుకుతుందని అందరూ గట్టిగా విశ్వసిస్తున్నారు.సెప్టెంబర్ 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించడమే మన లక్ష్యం.ఇంకా 52 లక్షల మంది అక్షరాస్యులు కావాల్సి ఉంది. సాధించి తీరుదాం అంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.  ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 2024 లో నేను విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించినప్పుడు మన రాష్ట్రం దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 2024 లో ఉన్న 72.6% నుండి 2026 నాటికి 82.1% కి చేరుకుందని ప్రకటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం తీసుకొస్తున్న ఈ మార్పు నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం.ఈ భారీ అక్షరాస్యతా క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహిస్తున్న విద్యాశాఖకు, అలాగే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’అక్షర ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా దాదాపు 25 లక్షల మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారారు. మనం ఇక్కడితో ఆగబోవడం లేదు. సెప్టెంబర్ 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. ఇక అక్షరాస్యత పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా కృషి చేస్తోంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంపై కూడా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.విద్యార్థులకు ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నారు.మరోవైపు ఉపాధ్యాయుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఏఐ టెక్నాలజీని జోడిస్తూ ‘ఏఐ సమర్థ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బోధనలో ఏఐ టూల్స్ ఎలా ఉపయోగించాలో నేర్పడం ద్వారా తరగతి గదిలో నేర్చుకోవడాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తున్నారు.  అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం రాష్ట్రవ్యాప్తంగా 125 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి తగిన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఇలా ప్రతి అంశాన్ని విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తుండడం కూడా అక్షరాస్యత పెరిగేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *