తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం…మంత్రి కొండా సురేఖ బర్త్ రఫ్…గవర్నర్ కు సీఎం రేవంత్ లేఖ 

Spread the love

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే ఇటీవల పరకాల నియోజకవర్గం గీసుకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశడ్డిని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని దీనిపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమె తన వివరణ ఇచ్చారు. ఆమె తన కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని సదరు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కోరారు. 

ఇక మరోవైపు వనపర్తి వ్యవహారంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఆయనకు కూడా వివరణ ఇవ్వాలని డీఏసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలను హైకమాండ్ కు  పీసీసీ పంపింది.కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి వ్యవహారంపై గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్, ముఖ్యనేతలు చర్చించారు.   ఈ నేపథ్యంలో అధిష్ఠానం కూడా వారిద్దరిపై వేటుకు అంగీకరించినట్లు  తెలుస్తోంది. మంత్రివర్గం నుండి కొండా సురేఖను తొలగించేందుకు అధిష్ఠానం అంగీకరించిన నేపథ్యంలో  సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు లేఖ పంపారు. ఆమెను మంత్రివర్గం నుండి వెంటనే  బర్తరఫ్ చేయాలని కోరారు. సీఎం లేఖపై గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్ గా  ఉన్న చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని సీఎం రేవంత్ నియమించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్ పర్సన్ జి.సుధారాణి అపాయింట్ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక తనను బర్త్ రఫ్ చేయాలన్న అంశంపై కొండా సురేఖ స్పందించారు. తన వివరణ తీసుకోకుండా బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారని ఉరిశిక్ష పడిన ముద్దాయిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఏ తప్పు చేయకపోయినా ఎందుకు చేస్తున్నామో చెప్పకుండా బర్తరఫ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.  మంత్రి పదవి నుంచి తనను  తొలగించే ఉద్దేశం కాంగ్రెస్ హైకమాండ్ కు లేదని ఆ విషయం తనకు వంద శాతం తెలుసని అయితే  సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ ను  బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.  ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? నన్ను రాజీనామా చేయమంటారా? అని సీఎం బెదిరించారు. నాతో పాటు మాజీ ఓఎస్జీ సుమంత్పై కుట్ర చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం సోదరులు కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డి కక్షగట్టారు. నాకు తెలియకుండా సుమంత్ను తప్పించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మంత్రి పదవి నుండి  తొలగించినందుకు బాధలేదని తాను ఏ తప్పుచేయలేదన్నారు.  బర్తరఫ్ ను  అవమానంగా భావించడం లేదని తమకు ప్రజాబలం ఉందని జనం తమ వెంటే ఉన్నారని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *