రైతుకు భరోసా..నెల నెలా రూ.3000 పెన్షన్…ఎవరు అర్హులంటే..?

Spread the love

ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన.  ఈ పథకం  ద్వారా దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా 3,000 చొప్పున జీవితాంతం పెన్షన్ అందుతుంది. అయితే రైతులందరూ ఈ పథకంలో చేరడానికి వీల్లేదు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్. ఈ పథకంలో చేరిన రైతులకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నెలనెలా 3,000 అంటే  ఏడాదికి 36 వేలు  వారి బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమవుతాయి. ఈ స్కీమ్ లో చేరడానికి రైతు వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. చేరిన వయసును బట్టి ప్రతి నెలా 55 నుంచి గరిష్టంగా 200 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. రైతు ఎంత మొత్తమైతే చెల్లిస్తాడో, కేంద్ర ప్రభుత్వం కూడా సరిగ్గా అంతే మొత్తాన్ని సమానంగా ఆ రైతు పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. ఒకవేళ రైతుకు 60 ఏళ్లు నిండి పెన్షన్ వస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు కన్నుమూస్తే.. ఆ రైతు జీవిత భాగస్వామికి  సగం పెన్షన్, అంటే నెలకు 1,500 ఫ్యామిలీ పెన్షన్  రూపంలో జీవితాంతం అందుతుంది. రూల్స్  ప్రకారం కొంతమంది రైతులు ఈ స్కీమ్ లో చేరడానికి అనర్హులు . ఈ స్కీమ్ కేవలం చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే. అంటే ఎవరికైతే తమ పేరు మీద  సుమారు 5 ఎకరాలు సాగు భూమి ఉంటుందో వారు మాత్రమే అర్హులు. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు, అలాగే సంస్థాగత భూములు ఉన్నవారు ఈ పథకానికి అస్సలు అర్హులు కారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏ సోషల్ సెక్యూరిటీ లేని వారికి అండగా నిలవడం. కాబట్టి, ఇప్పటికే ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల్లో ఉన్నవారికి ఇది వర్తించదు. అంటే ఎవరైతే నేషనల్ పెన్షన్ సిస్టమ్ , ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ , ఈఎస్ఐసీ స్కీమ్స్ కింద లబ్ధిదారులుగా ఉన్నారో వారికి కూడా ఇది రాదు. అలాగే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ లేదా లఘు వ్యాపారి మాన్‌ధన్  పథకాలను ఎంచుకున్న రైతులు కూడా ఈ కిసాన్ మాన్‌ధన్ పథకానికి అనర్హులు. వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు ఉండి, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు ఎవరైనా సరే.. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నట్లు పరిగణించి, వారిని ఈ పథకం నుండి తప్పించారు.

వ్యవసాయ భూమి ఉండి, 5 ఎకరాల కంటే తక్కువే ఉన్నప్పటికీ.. ఒకవేళ వారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటే వారికి ఈ స్కీమ్ వర్తించదు. మాజీ , ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ ,రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, జిల్లా పంచాయతీ మాజీ ,  ప్రస్తుత చైర్ పర్సన్స్ ఎవరూ కూడా ఈ పథకానికి అర్హులు కారు.  కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ,  ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్, లేదా  రిటైర్ అయిన అధికారులకు, ఉద్యోగులకు ఈ పెన్షన్ రాదు. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు , ఆర్కిటెక్టులు.. వీరెవరైనా తమ వృత్తి చేస్తూనే వ్యవసాయం చేస్తున్నప్పటికీ, వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ స్కీమ్ లో చేరడం చాలా సులభం, పైగా ఉచితం. రైతులు తమ దగ్గరలోని  కామన్ సర్వీస్ సెంటర్ లేదా  మీ-సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ , క్యాన్సిల్ చేసిన చెక్, అలాగే పట్టాదార్ పాస్ బుక్   ఉంటే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు ఒకవేళ ఏమైనా 30 రూపాయలు ఛార్జీలు అయితే, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. చాలామందికి వచ్చే డౌట్.. 40 ఏళ్ల వరకు కట్టాలి కదా, ఒకవేళ మధ్యలో మనకు కట్టడం ఇష్టం లేకపోతే డబ్బులు వెనక్కి వస్తాయా అని. కచ్చితంగా వస్తాయి. పథకంలో చేరిన 5 ఏళ్ల లోపు మానేస్తే.. మీరు అప్పటి వరకు కట్టిన డబ్బులను బ్యాంక్ సేవింగ్స్ వడ్డీతో సహా వెనక్కి ఇస్తారు. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత మానేస్తే.. మీరు కట్టిన డబ్బులకు, పెన్షన్ ఫండ్ సంపాదించిన వడ్డీని   కలిపి వెనక్కి ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *