సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘జైలర్ 2’ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. జైలర్ 1 ఎంత భారీ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. ఈసారి ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనున్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. మోహన్ లాల్, శివ శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్ తదితరులు ప్రత్యేక పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబరు 15న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రంలోని “వన్ సన్.. వన్ మూన్..” అంటూ సాగే సూపర్ సాంగ్ ను విడుదల చేశారు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. హైసెన్ బర్గ్, భాస్కరభట్ల సాహిత్యమందించారు. అనిరుధ్, ఇన్నో గెంగా, ఎంఎస్ కృష్ణ సంయుక్తంగా ఆలపించారు. ఎప్పటిలాగానే ఈ పాటలో కూడా రజనీ స్టైల్, స్వాగ్.. స్క్రీన్ ప్రెజెన్స్ అలరిస్తున్నాయి.
ఈ సీక్వెల్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన ‘జైలర్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించి, రజనీకాంత్ మాస్ మేనియాను మరోసారి చూపించింది. ఇప్పుడు అంతకు మించిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘జైలర్ 2’ రూపంలో బాక్సాఫీస్ వద్ద మరోసారి పెద్ద ఎత్తున సందడి చేయడానికి చిత్రబృందం పూర్తిస్థాయిలో రెడీ అవుతోంది. ఈ సీక్వెల్‌ను మరింత పవర్‌ఫుల్‌గా, విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ విలువలతో, సాంకేతికంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ విజువల్ స్పెక్టాకిల్‌ను రూపొందించారు. ఈ సీక్వెల్‌లో ప్రధాన తారగణంతో పాటు న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్‌లతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. తాజాగా విడుదల చేసిన “వన్ సన్.. వన్ మూన్..” అనే మాస్ సాంగ్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఉర్రూతలూగించే ట్యూన్స్ అభిమానులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గీతానికి హైసెన్ బర్గ్ మరియు భాస్కరభట్ల కలసి పవర్‌ఫుల్ సాహిత్యాన్ని అందించగా, అనిరుధ్, ఇన్నో గెంగా మరియు ఎంఎస్ కృష్ణ కలసి ఆలపించారు. ఎప్పటిలాగే ఈ పాట విజువల్స్‌లో రజనీకాంత్ ట్రేడ్‌మార్క్ స్టైల్, అసమానమైన స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 15న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు.