బాహుబలి రికార్డ్ బద్దలు..ఇండియాలో అవెంజర్స్ ఎండ్‌గేమ్ సరికొత్త చరిత్ర

Spread the love

సినిమా ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ల ట్రెండ్ ఇప్పుడు ఏ స్థాయిలో నడుస్తోందో మనందరికీ తెలిసిందే. పాత క్లాసిక్ సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సంచలన వార్త ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో టీమ్ ఆధారంగా మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అవెంజర్స్ ఎండ్‌గేమ్ . చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ పేరుతో థియేటర్లలోకి వచ్చిన ఈ మార్వెల్ సినిమా ఇండియాలో అద్భుతాన్ని సృష్టించింది.  రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు మన దేశంలో రీ-రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రికార్డు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన  బాహుబలి ది ఎపిక్  పేరిట ఉంది. కానీ ఇప్పుడు ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ ఆ రికార్డును హాయిగా దాటేసి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.  ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ స్యాక్‌నిల్క్ నివేదిక ప్రకారం అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ చిత్రం శుక్రవారం ఒక్క రోజే మన దేశంలో ఏకంగా 7 కోట్ల 25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. మన దేశంలో కేవలం 3600 స్క్రీన్స్‌లో మాత్రమే విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం నిజంగా ఒక అదిరిపోయే రికార్డు అనే చెప్పాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్‌కి మన దేశంలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు మన దేశంలో రీ-రిలీజ్ లో అత్యధికంగా 5 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన  బాహుబలి ది ఎపిక్  రికార్డును ఈ మార్వెల్ సినిమా తిరగరాసింది. ఈ ఎన్‌కోర్ వెర్షన్‌లో మేకర్స్ జోడించిన నాలుగు నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ ఫ్యాన్స్‌ను మరోసారి థియేటర్లకు పరుగులు తీయిస్తోంది. ఆ కొద్దిపాటి అదనపు విజువల్స్ సినిమాపై ఉన్న క్రేజ్ ను తారాస్థాయికి చేర్చాయి.కేవలం రీ-రిలీజ్ సినిమానే అయినా, ఫ్యాన్స్ మాత్రం దాన్ని ఒక కొత్త సినిమా లాగే ఆదరిస్తున్నారు. ఆ నాలుగు నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ కోసం థియేటర్ల వద్ద జనాలు ఎగబడుతున్నారు. అయితే ఈ రీ-రిలీజ్ వెనుక మార్వెల్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంది. రాబోయే రోజుల్లో రాబోతున్న బిగ్గెస్ట్ సినిమాకు ఇది ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ లా పనిచేస్తోంది.  ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే, మార్వెల్ రాబోయే భారీ చిత్రం  అవెంజర్స్: డూమ్స్‌డే  కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్  లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన విలన్.. డాక్టర్ డూమ్ రాకను హింట్ చేస్తూ వస్తున్న ఈ పరిణామాలు రాబోయే డూమ్స్‌డేకి గట్టి పునాది వేశాయి. థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఎగబడి చూడటంతో ఎంసియుకి మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయని అనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో డూమ్స్‌డే  ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో ఇప్పటి నుంచే ఊహించుకోవచ్చు. ఇక, ఈ  ఎండ్‌గేమ్ ఎన్‌కోర్  ను డైరెక్ట్ చేసిన జో-యాంతోనీ రూసో జోడీనే రాబోయే  అవెంజర్స్: డూమ్స్‌డే ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు మనందరికీ ఇష్టమైన ఐరన్ మ్యాన్‌గా మెప్పించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుని విలన్‌గా డాక్టర్ డూమ్ అవతారంలోకి మారుతుండటం అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. ఆయన మ్యాజిక్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *