‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, సోనాల్ కులకర్ణి, రాఘవ్ జుయెల్, ప్రియదర్శి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. పాటలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో తెలిసిందే. నాని మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారు. ఆయన నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నానికి ఉన్న స్టామినా ఏంటో చూపించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, ప్రేక్షకుల అభిప్రాయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని స్పందించారు. ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
మీ రియాక్షన్స్, రెస్పాన్సెస్ అన్నింటినీ నేను చూశాను. మీరు అందించిన ప్రేమనంతటినీ స్వీకరించాను, అలాగే మీరు వేసిన నవ్వు తెప్పించే ట్రోల్స్‌ను కూడా అంతే సమానంగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ సొంత సినిమాగా ఆదరించిన తీరు నా మనసును తాకింది. అలాగే క్రిటిక్స్, రివ్యూవర్స్ ఎత్తిచూపిన లోపాల నుండి పాఠాలు నేర్చుకున్నాను.మీరందించిన ప్రతిదానికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు ఒక విభిన్నమైన అనుభూతిని అందించడం కోసం ఎంతో కష్టపడి, రక్తం చెమట చిందించి మేము #TheParadise చిత్రాన్ని నిర్మించాము. దాన్ని ఆనందించినా లేదా విమర్శించినా ఆ హక్కు పూర్తిగా మీదే. ఈ సినిమా పట్ల మీరు చూపించిన ఉత్సాహం, నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని నాని అన్నారు. నాని మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. క్లిష్టమైన ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ లో ఆయన చూపించిన నటన, హావభావాలు ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసాయి. ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో సీన్లను పతాకస్థాయికి తీసుకెళ్లిన తీరుకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఒక వైవిధ్యమైన పాత్రలో జీవించిన నాని, తన మేనరిజమ్స్ మరియు డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఈలలు, కేకలు వేయించారు. మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించిన ‘ది ప్యారడైజ్’, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.