ఐరన్ లెగ్ లేడీతో.. టీటీడీలో ఉన్నతాధికారికి ఉద్వాసన..?

Spread the love

ఆమె ఎక్కడ అడుగుపెడితే అక్కడ పదవులు అవుట్.. అధికారికంగా అట్టడుగుకు చేరుతారనే సెంటిమెంట్. ఐరన్ లెగ్ లేడీ గా పేరు తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి, తరచూ తిరుమలకు వస్తూ అధికారులకు టెన్షన్ తెప్పిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వoపై దుమ్మెత్తిపోయడం ఆమాజీ మంత్రికి షరామాములే. మరి ప్రభుత్వం పై నోరూపారేసుకునే ఆ మాజీ మంత్రికి టీటీడీలోని పెద్దలు ప్రత్యేక మర్యాదలను చేస్తుండటం, వీఐపీ దర్శనాల పేరిట స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంప్రస్తుతం దుమారం రేపుతోంది.ఈ రాచమర్యాదలు, వివాదాస్పదమై, ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోనని టీటీడీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? టీటీడీ అధికారులకు ఏంటీ తలనొప్పి లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

కలియుగ ప్రత్యక్ష దైవం,శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ప్రతిరోజూ తిరుమలకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపిలు కూడా చాలామంది ఉంటారు. అయితే అలా వీఐపీలు, ప్రముఖులు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ తో పాటుగా,వారి గౌరవార్థం తిరుమల శ్రీవారి ఆలయ పండితులు వేదఆశీర్వచనాలు అందించి, శేషవస్త్రంతో సత్కరిస్తుంటారు.ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజాకు తిరుమల శ్రీవారి ఆలయంలో రాచమర్యాదలు చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై సీరియస్ అయినట్లు సమాచారం.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వీఐపీలు, వీవీఐపిలకు ఆలయంలో వారి గౌరవార్థం వేదపండితులు ఆశీర్వచనాలు అందించడం, అధికారులు శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ విధానం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో అమల్లో ఉంది. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి రోజా ఎక్కడ అడుగుపెడితే అక్కడ పదవులు కోల్పోయి, అధికారికంగా అట్టడుగుకు చేరుతారనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఐరన్ లెగ్ లేడీ అని పేరు తెచ్చుకున్న ఈ మాజీ మంత్రి, తరచూ తిరుమలకు వస్తూ, వీఐపీ దర్శనాల పేరిట ప్రత్యేక మర్యాదలు పొందడం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఈ రాచమర్యాదలు, వివాదాస్పదమై, ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోనని టీటీడీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.మరో వైపు అవకాశం దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వo పై దుమ్మెత్తిపోయడం ఈ మాజీ మంత్రికి షరామాములే. ప్రభుత్వం పై నోరూపారేసుకునే రోజాకు టీటీడీలోని పెద్దలు ప్రత్యేక మర్యాదలు చేశారని, తరచూ ప్రత్యేక బ్రేక్ దర్శనాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్నపుడే కాదు, ఇప్పుడు కూడా వారానికోసారి రోజా తిరుమల కొండకు రావడం, మందీ మార్బలంతో హంగామా సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

టీటీడీలోని పెద్దలు ఈ మాజీ మంత్రికి ప్రత్యేక శ్రద్ధ చూపించి, కోరినన్ని దర్శన టికెట్లు మంజూరు చేయడంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై టీటీడీ స్పందించింది. ఇది నిజమైన వీడియోలు కావని మార్ఫింగ్ చేసి కావాలనే టిటిడి పై బురద చల్లడానికి కొంతమంది చేసిన ప్రయత్నాలని టీటీడీ తన వెబ్సైట్లో తెలియచేసింది. అందులో వాస్తవం కూడా లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఈ వ్యవహారం లో ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీలో కీలకమైన అధికారి బదిలీ తప్పదని ప్రభుత్వ వర్గాల ద్వారా అందిన సమాచారం. మొత్తం మీద ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ మాజీ మంత్రి ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రకంపనలే సృష్టిస్తోంది . మాజీ మంత్రి తెలుగుదేశంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారం కోల్పోవడం, మళ్ళీ వైసీపీ పంచన చేరాక, జగన్ జైల్ కు వెళ్లడం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కొన్నేళ్లు నెట్టుకొచ్చినా, చివరకు అధికారం కోల్పోవడం జరిగింది. ఎటు తిరిగి ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకున్న ఆ మాజీ మంత్రి ఇప్పుడు వరుసగా తిరుమలకు వస్తుండడం కారణంగా టిటిడిలోని కీలకమైన అధికారి పై బదిలీ వేటు, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పని పరిస్థితిగా ఏర్పడింది.