
ఆ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మూడు ముక్కలాట కొనసాగుతుందట. రానున్న ఎన్నుకల్లో టిక్కెట్టుకోసం తలో దారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారట. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు మొఖం చాటేయాడంతో.. అయన స్థానాన్ని భర్తీ చేయడానికి ఇదే అదునుగా మరో ఇద్దరి నేతలు అవకాశం కోసం పావులు కలుపుతున్నారట. ఇప్పుడు ఇన్చార్జి పదవి దక్కితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ అన్న ధోరణి తో నేతలు పావులు కడుపుతుండటం తో అక్కడి బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం జోరందుకుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం..? లెట్స్ వాచ్ ది స్ ఆఫ్ ది రికార్డ్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కల్వకుర్తి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంటాయి. ఎన్టీ ఆర్ నే ఓడించిన ఘనత ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలది. ఎక్కువగా హైదరాబాద్ రాజకీయాలు కల్వకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తుంటాయి. ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు కూడా హైదరాబాద్ ప్రాంతానికి అత్యంత దగ్గర కావడం వ్యాపారం, బంధుత్వాలు ఎక్కువగా హైదరాబాద్ వారితో ఉండడం రాకపోకలు కూడా ఎక్కువగా చేయడం వల్ల కల్వకుర్తి నియోజకవర్గం లో హైదరాబాద్ రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇదే క్రమంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముగ్గురు నేతల మధ్య ఇప్పుడు ఇంచార్జి పదవీకోసం పోటా పోటీ కొనసాగుతుంది. దింతో కల్వకుర్తిలో బీఆర్ఎస్ రాజకీయం వేడెక్కింది. ఇందుకు కారణం..2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన జైపాల్ యాదవ్.. ఓటమి చెంది… నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడమే అన్న చర్చ జోరుగా సాగుతుంది.
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్ యాదవ్.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. నాడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి 2023 ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. జైపాల్ యాదవ్ పై విజయకేతనం ఎగరవేశారు. దింతో తన ప్రత్యార్థి చేతిలో ఓటమి చెందిన జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదట. దింతో నియోజకవర్గం లో పార్టీకి పెద్దదిక్కు లేకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారని క్యాడర్ అసంతృప్తి లో ఉందట. జైపాల్ యాదవ్ కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యారని, నియోజకవర్గంలో చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలితో కార్యకర్తలు కూడా ఏ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనే లేకపోతున్నారట.ఈ క్రమంలో నే జైపాల్ యాదవ్ మైనస్ లను చూపెడుతూ తమకు ప్లస్ లుగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారట..ఆ ఇద్దరు నేతలు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహార శైలితో విసుగు చెందిన ఆ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ క్యాడర్ ను ఉత్తేజపరిచేందుకు నడుం బిగించారట.. వారిలో గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా పనిచేసిన తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ముందువరుసలో ఉన్నారట. ఉప్పల వెంకటేష్ పేరు కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో సుపరిచితమే. ఓసీ వర్గానికి చెందిన ఉప్పాల వెంకటేష్ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలుస్తుంటారని టాక్ ఉంది. ఇదే ఆ నియోజకవర్గంలో ఉప్పల వెంకటేష్ కు కలిసి వస్తుందట. ముఖ్యంగా పేదల చదువుల కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఉప్పల వెంకటేష్ సహాయం చేస్తారనే అభిమానంతో ఆయనకు బలమైన కేడారే ఉందటం తో… బీఆర్ఎస్ పార్టీకి కీ పెద్దదిక్కుగా మారే అవకాశాలు ఎక్కువగా నే ఉన్నాయట. దీంతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గానికి దూరం కావడం… ఇదే అదనుగా తనకొచ్చిన అవకాశంగా ఉప్పల వెంకటేష్ రాజకీయ నియోజకవర్గం లో దూసుకుపోతున్నరట.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న సత్సంబాందాలతో ఉప్పల వెంకటేష్ కు పార్టీ ఇన్చార్జ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే క్రమంలో ఉప్పల వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై కూడా కన్నేశారన్న టాక్ కాల్వకుర్తి లో జోరుగా సాగుతుంది. ఇటీవల జరిగిన బిఆర్ఎస్ రజోత్సవ వేడుకలకు సైతం ఆయన వందల వాహనాలను ఏర్పాటు చేయడం, కార్యకర్తలను వేల సంఖ్యలో ఆ కార్యక్రమానికి తరలించడం తో నియోజకవర్గం కూడా ఇలాంటి నేత అవసరం అన్న భావన అడిష్టాణంలో కలిగిందన్న ప్రచారం సాగుతుంది .
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మైనస్లను ఆసరాగా చేసుకుంటూ మరో నేత కూడా వచ్చే ఎన్నికల లో తనకు అసెంబ్లీ టికెట్ కన్ఫామ్ అని చెప్పుకుంటున్నారట. ఆయనే గోలి శ్రీనివాస్ రెడ్డి. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డికి.. ఇప్పటి వరకు ఏ పదవి వరించలేదు. బీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక.. చివరి కాలం లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం జైపాల్ యాదవ్ యాక్టివ్ గా లేకపోవడం తో పార్టీ లో తానే సీనియర్ కావడం తో వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అని భావిస్తున్నారట గోలి శ్రీనివాస్ రెడ్డి. బీ ఆర్ ఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా తానే ముందుంటూ.. స్పష్టంగా అక్కడ జరిగే కార్యక్రమాలలో తన ప్రమేయం ఉండేలా చూసుకునుటున్నారట .
ఇలా ఇద్దరు దిగువ శ్రేణి నేతలు జైపాల్ యాదవ్ పై విమర్శలు చేస్తుండగా ఆ విమర్శలను జయపాల్ యాదవ్ వర్గం కొట్టిపరిస్తుందట.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవర్టులే జైపాల్ యాదవ్ ఓటమికి కారణమని.. బీసీ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో మరోసారి విజేయఢంకా మోగిస్తారని ఆయన వర్గం ప్రచారం చేస్తుందట. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వర్గానికి మద్దతు తెలపాలో తెలియక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. అందుబాటులో లేని నేతల వల్ల నియోజకవర్గంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని. అధిష్టానం పట్టించుకుని నియోజకవర్గంపై దృష్టి సారించాలని సీనియర్ నేతలు కోరుతున్నారట.
ఏది ఏమైనా ఒకప్పుడు కల్వకుర్తి లో బలమైన పార్టీగా బి ఆర్ ఎస్ ఉండేది.. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఆ నియోజకవర్గంలో పార్టీలో కూడా పదవుల పందెం కోసం వర్గాలుగా విడిపోతున్నారు నేతలు.. దీనికి తోడు పార్టీ పదవలు అనుభవించిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఓటములతో నియోజకవర్గం వైపు చూడకపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మరి భవిష్యత్తులో ఆ నియోజకవర్గంలో ఈ ముగ్గురు నేతల మధ్య రాజకీయ రణరంగం తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతుంది.