పోలీస్ డ్రెస్ లో.. చిరు, వెంకీ..?

Spread the love

Chiru and Anil Ravapudi Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయన తార నటిస్తుంది. ఈ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ లో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తుండడం విశేషం. అయితే.. చిరు, వెంకీ కలిసి నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ ఏ ఏ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు..? గెటప్పులు ఎలా ఉంటాయి..? అనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది. అనిల్ రావిపూడి మాత్రం అసలు కథ ఏంటో..? చిరు, వెంకీ క్యారెక్టర్స్ ఏంటో బయటపెట్టలేదు కానీ.. క్యారక్టర్స్ గురించి ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ.. చిరు, వెంకీ ఎలా కనిపించబోతున్నారు..?

చిరు మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పుడు ఇదేదో గెస్ట్ రోల్ అనుకున్నారు. ఇలా కనిపించి అలా వెళ్లిపోతాడు వెంకీ అని గుసగుసలు వినిపించాయి. అయితే.. ఈ సినిమా కోసం వెంకటేష్ 20 రోజులు డేట్స్ ఇచ్చారని తెలియడంతో ఈ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్లారిటీ వచ్చింది. అంతే కాకుండా వెంకీ దాదాపు గంట సేపు కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే.. గంట సేపు కాకపోయినా ఓ అరగంట ఖచ్చితంగా కనిపిస్తాడని మరో వార్త కూడా వైరల్ అయ్యింది. దీంతో చిరు, వెంకీ క్యారెక్టర్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది..? ఎలాంటి సీన్స్ ఉంటాయని సినీ అభిమానులు ఆరా తీస్తున్నారు.

అయితే.. ఈ సినిమాలో చిరు, వెంకీ అండ‌ర్ క‌వ‌ర్ పోలీసులుగా కనిపిస్తారని.. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే.. వేరే లెవల్లో ఉంటాయట. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా అనిల్ రావిపూడి డిజైన్ చేశాడట. దీనిని బట్టి ఆడియన్స్ చిరు, వెంకీ పోలీస్ గెటప్పులతో నవ్విస్తారేమో. వీరిద్దరూ పోలీస్ లుగా నటించారు.. సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఒకేసారి పోలీస్ గెటప్పులో.. ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఆడియన్స్ కి ఆ కిక్కే వేరుగా ఉంటుంది. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. Chiru and Anil Ravapudi Movie.

అనిల్ రావిపూడి తన సినిమాల్లో పాటలను చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తుంటారు. పాటలతోనే సినిమాను సగం హిట్ చేయించేస్తారు. ఈ సినిమా సాంగ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఓ సాంగ్ ను రమణ గోగులతోను, మరో సాంగ్ ను మెగాస్టార్ తోనూ పాడిస్తున్నారట. చిరు పాట అందుకుంటే.. ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భారీ సినిమాను సాహు గార‌పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు భారీ స్థాయిలో రానుంది. ఈ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే.. సంక్రాంతికి రఫ్పాడించేయడం ఖాయం అనిపిస్తోంది.

Also Read: https://mega9tv.com/cinema/rajinikanths-latest-sensation-coolie-the-trailer-of-coolie-is-going-to-create-a-new-trend/