ఎన్టీఆర్ కు జంటగా మలయాళ హీరోయిన్..?

Spread the love

NTR Trivikram Mythological Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూర్తి చేసిన వెంటనే,గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్ట్‌ను కన్ ఫర్మ్ చేశాడు. దీని కోసం ప్లానింగ్ కూడా ఓ వైపు జరుగుతోంది. ఆనంద్ బాలసుబ్రమణియన్ రాసిన మురుగ అనే పుస్తకాన్ని ఎన్టీఆర్ చదువుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా మలయాళ హీరోయిన్..? అసలు ఈ వార్త ఎలా లీకైంది..?

ఎన్టీఆర్ మూవీలో నటించే మలయాళ హీరోయిన్ ఎవరంటే.. మంజిమా మోహన్. ఈ వార్త ఎలా లీకైందంటే.. నటి మంజిమా మోహన్ కూడా ఎన్టీఆర్ చదవిన మురుగ పుస్తకాన్నే చదువుతుంది. ఈ పుస్తకం ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ రాసిన పుస్తకాన్నే మంజిమ కూడా చదవడంతో మంజిమ ఈ సినిమాలో భాగం కాబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌లు ఏవీ అఫిషియల్ గా బయటకు రాలేదు కానీ మంజిమాను ఎంచుకోవడం మాత్రం సరైన నిర్ణయమే అనిపిస్తోంది.

మురుగుకి ఇద్దరు భార్యలు, వారిలో ఒకరు దేవసేన, మరొకరు వల్లి. దేవసేన ఇంద్రుని కుమార్తె, వల్లి ఒక గిరిజన నాయకుడి కుమార్తె. మంజిమ కూడా ఈ పుస్తకాన్ని చదవడం పూర్తిగా యాదృచ్ఛికం కావచ్చు. అలాగే ఆమె ఎన్టీఆర్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటూ సినిమాలో భాగం కావడం కూడా వాస్తవం కావచ్చు. ఏది ఏమైనా మంజిమ గొప్ప నటి, ఆమె ప్రతిభను ఇప్పటి వరకు అంతగా బయటపడలేదు. ఆమె తెలుగులో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది. NTR Trivikram Mythological Movie.

మంజిమా మోహన్ మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా పరిచయమైంది. తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నటుడు గౌతమ్ కార్తీక్‌ని పెళ్లాడిన ఆమె గత మూడేళ్లుగా ఏ కొత్త చిత్రానికి కమిట్ కాలేదు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీలో మంజిమ నటిస్తుంది అనేది ప్రస్తుతానికి ఊహగానాలే కానీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. త్రివిక్రమ్ ఓ వైపు వెంకీతో సినిమా చేస్తూనే మరో వైపు ఎన్టీఆర్ తో చేసే మైథలాజికల్ మూవీ గురించి కూడా ప్లానింగ్ చేస్తున్నారని.. ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని టాక్. ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంటే మాత్రం మంజిమ లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే.

Also Read: https://mega9tv.com/cinema/chiru-and-venky-are-rumored-to-be-appearing-as-undercover-cops-in-anil-ravapudi-movie/