కింగ్ డమ్ పై నాగవంశీకి అంత నమ్మకమా..?

Spread the love

Naga Vamsi Kingdom: విజయ్ దేవరకొండ నటించిన మూవీ కింగ్ డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈమధ్య కొన్ని సీన్స్ రీషూట్స్ కూడా చేయడం జరిగింది. పోస్ట్ పోన్ అవుతూ వస్తోన్న కింగ్ డమ్ ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే.. ఈ నెల 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వీరమల్లు వస్తుంది. అయితే.. పవర్ స్టార్ సినిమా వీరమల్లు వచ్చిన వారం గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత నాగవంశీ ధైర్యం ఏంటి..? వీరమల్లు వచ్చిన రెండు వారాల తర్వాత కింగ్ డమ్ రిలీజ్ చేయచ్చు కదా అనే మాట వినిపిస్తోంది. అసలు దీని వెనుక ఉన్న నాగవంశీ ప్లాన్ ఏంటి..?

నిర్మాత నాగవంశీ.. టేస్ట్ అండ్ టాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్. పక్కా ప్లానింగ్ తో… మాంచి డేట్ చూసి సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ సాధిస్తుంటాడు. అందుకనే ఆయన సక్సెస్ రేట్ అంత బాగుంది. ఆయన బ్యానర్ నుంచి వస్తోన్న కింగ్ డమ్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మీడియా ముందు మాట్లాడినా.. సోషల్ మీడియాలో మాట్లాడినా.. కింగ్ డమ్ పై తనకున్న గట్టి నమ్మకాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మాటలతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. అయితే.. పవర్ స్టార్ వీరమల్లు రిలీజ్ అయిన వారానికే కింగ్ డమ్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండష్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ తో నాగవంశీకి మంచి అనుబంధం ఉంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడం.. పైగా భారీ పీరియాడిక్ మూవీ కావడంతో ఓపెనింగ్స్ బాగుంటాయి. సరైన టాక్ వస్తే.. రెండు వారాలేంటి మూడు వారాలు కూడా నడుస్తుంది. అందుచేత వీరమల్లు తర్వాత సినిమా రిలీజ్ చేయడానికి కనీసం రెండు వారాలు గ్యాప్ ఇవ్వాలి. అయితే.. రెండు వారాలు గ్యాప్ ఇచ్చి కింగ్ డమ్ రిలీజ్ చేస్తే.. ఆతర్వాత వారంలో కూలీ, వార్ 2 సినిమాలు వస్తాయి. ఈ రెండు సినిమాలతో పోటీ కన్నా.. వీరమల్లుతో పోటీ పడడం ఈజీ అనుకున్నాడమో కింగ్ డమ్ రిలీజ్ ను జులై 31న అని ఫిక్స్ చేశాడు నిర్మాత నాగవంశీ.

పవర్ స్టార్ స్టామినా ఏంటి అనేది నాగవంశీకి బాగా తెలుసు. పైగా పవన్ తో సినిమాలు కూడా తీసాడు. అయినప్పటికీ ఎందుకు వీరమల్లు వచ్చిన వారానికే కింగ్ డమ్ రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే.. నాగవంశీ తనదైన స్టాటజీతో సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు. కింగ్ డమ్ సినిమాకి బాగానే ఖర్చు పెట్టాడు. తిరిగి రాబట్టాలంటే.. కనీసం రెండు వారాలు అయినా ఆడాలి. అందుకనే ఇలా ఈ నెల 31న రిలీజ్ ప్లాన్ చేశాడని టాక్. ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది నాగవంశీ కంటే విజయ్ కి చాలా కీలకం. మరి.. నాగవంశీ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో..? విజయ్ కి ఆశించిన విజయాన్ని కింగ్ డమ్ అందిస్తుందో లేదో చూడాలి. Naga Vamsi Kingdom.

Also Read: https://mega9tv.com/cinema/rashmika-ties-up-with-allu-arjun-and-atlee-pan-world-movie-bunny-rashmika-combo-before-pushpa-3/