
Guntur District Food Controller Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ జిల్లాకు ప్రత్యేకత ఉంది. అదే జిల్లాలోని ఓ ప్రాంతంలో తినుబండారాలల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంగిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తూనే ఉంటారు. జిల్లా ఆహార నియంత్రణాధికారి సూచనలను, నిబంధనల మాత్రం ఏ మాత్రం పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఫంక్షన్లకు వినియోగించే స్పెషల్ ఐటమ్స్ కూడా మోతాదుకు మించిన రంగులు కలుపుతున్నాట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఆ జిల్లా పేరు వింటేనే ప్రజల ప్రాణాలను కాపాడే మెడిసిన్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరూ ఇంటిలో వినియోగించే వంటనూనెల వరకు కల్తీలకు కేరాఫ్ అయిందట. ఈ మధ్యకాలంలో రుణాల పేరుతో జిడిసిసి బ్యాంకులలో సైతం నకిలీ ప్రూపులతో, బ్యాంకు సిబ్బందిని బ్యాంకు ఉద్యోగస్తులను, సాధారణ పౌరులను సైతం బెంబేలేత్తించిన ఘనత కూడా ఆ జిల్లాకు ఉంది. అంతేకాదండోయ్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కట్టడికి ఉపయోగించే, శానిటైజర్ సైతం కల్తీ చేసే సత్తా ఉన్న ఏకైక జిల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో సైతం ఉమ్మడి గుంటూరు జిల్లా పేరు మారు మ్రోగిపోయింది.
అటువంటి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించి ఎందరో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండి, ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించి , నిజాయితీకి మారుపేరుగా పలువురు ఉన్నతాధికారులుగా పేరు కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి గుంటూరుజిల్లాలో ఆహార పరిరక్షణ, నియంత్రణా శాఖలో మాత్రం, ఆహారంలో ఎలా కల్తీ చేస్తున్నారో, ఆ శాఖలో కూడా, కొందరి ఉదాసీనత మరికొందరి లంచగొండితనం వలన, మామూళ్ల మత్తులో అలవాటు పడిపోయారట. ప్రజల ప్రాణాలను సైతం తుంగలో తొక్కేసి, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఆదేశాలను సైతం పక్కన పడేసినట్లు తెలుస్తోంది. మరికొందరు అధికారులు, యజమానులతో కుమ్మక్కై, హోటల్స్, టిఫిన్ వ్యాపారస్తులు, పాస్ట్ పుడ్ సెంటర్ నిర్వహకులు, బేకరీ, స్వీట్ షాప్ వంటి ఏ విధంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారో అన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదట. Guntur District Food Controller Department.
గుంటూరు జిల్లాలో గతంలో ఆహార నిబంధన నియంత్రణ అధికారిగా పనిచేసిన ఉన్నతాధికారి కనుసన్నల్లో పరిస్తితి బాగా ఉండేదట. జిల్లాపై ఆయనకు గతంలో అనుభవం దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం గుంటూరుకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గా, పూర్ణచంద్రరావు అనే అధికారిని నియమించింది. అయితే ఆయన ఆధీనంలో విధులు నిర్వర్తించాల్సిన ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులు మాత్రం దారితప్పుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలువురు వ్యాపారస్తులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయట. దీంతో వ్యాపారస్తులు వారికి తోచినట్లుగా ప్రభుత్వ నిబంధనలను, ప్రభుత్వ ప్రమాణాలను ఏమాత్రం పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారట. అధికారుల అండలు తమకు ఉన్నాయన్న ధీమాతో ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నారట. హాని కలిగించే రంగులను అధిక మొత్తంలో తినుబండారాల్లో కలుపుతున్నాట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.