మాజీ మంత్రి కొండ్రు మురళి అలిగారా?

Spread the love

Former Minister Kondru Murali Mohan: మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచీ చిన్నబాబు లోకేష్ ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నాయి. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా మాజీ మంత్రికి అమాత్యాయోగం మళ్లీ వరించలేదు. అందుకే ఎవరికి చెప్పుకోలేక, ఇటు మింగలేక అటు కక్కలేక సతమతం అవుతున్నారట. ఇంతకీ అంత అవస్థ పడుతోన్న ఆ సీనియర్ శాసనసభ్యులు ఎవరు. వాచ్ దిస్ స్టోరి.

ఇరవై అయిదేళ్ళ రాజకీయ ప్రస్థానం. మూడు పర్యాయాలు ఎమ్మెల్యే.. ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విప్, అలాగే మంత్రిగా పనిచేసిన అనుభవం. ఇవన్నీ గతం. ప్రస్తుతం ప్రమోషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. కూటమి ప్రభుత్వంలో తనకు పదవి యోగం దక్కలేదన్న అసంతృప్తిలో ఆయన ఉన్నారట. ఆయన పేరే కొండ్రు మురళీమోహన్. 2009లో ఎచ్చెర్ల ఎస్సి రిజర్వుడు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2024 రాజాం ఎస్సి రిజర్వుడు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన కొండ్రు మురళి, మంత్రి పదవి ఆశించి భంగపడ్డారట.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియతో విబేధించి టీడీపీలోకి వచ్చారు. ఆ తర్వాత 2019లో పోటీ చేసి ఓడిపోయారు మాజీ మంత్రి కొండ్రు మురళి. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన మురళికి మంత్రి లోకేష్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా లోకేష్ ఆశీస్సులు అమాత్య యోగ్యానికి నోచుకోలేదని కొండ్రు మురళి లోలోపల ఆవేదన చెందుతున్నారట. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి, ఎస్సి రిజర్వుడు నియోజక వర్గాల్లోంచి మూడు సార్లు గెలిచి, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా ఈసారి కొండ్రు కి అదృష్టం వరించకపోవడం పట్ల లోలోపల మదన పడుతున్నారట. Former Minister Kondru Murali Mohan.

గతంలో విప్ గా పనిచేసినప్పటికి కనీసం సహాయమంత్రి హోదా సైతం దక్కక పోవడం పట్ల ఆవేదన చెందుతున్నారట కొండ్రు మురళి. జిల్లాల విభజన కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోయిన ఈ శ్రీకాకుళం జిల్లా నేత, ఇప్పుపడు అలక పాన్పు ఎక్కారట. రాజాం అసెంబ్లీ నియోజక వర్గానికి పరిమితం అయిన మాజీ మంత్రి కొండ్రు మురళి మోహన్ కేబినెట్లో చోటు లేకపోవడంతో గుర్తింపు పొందిన నామినేటెడ్ పదవి వస్తుందని భావించినప్పటికీ అక్కడ సైతం నిరాశే మిగిలింది. దీంతో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ప్రమోషన్ లేక నిట్టూర్పుతో ఉండిపోతున్నారట. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆశలు ఎలా నెరవేరుతుందన్నది కూటమి ప్రభుత్వంతో పాటు కాలమే నిర్ణయించాలి.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/guntur-district-food-controller-department-corruption-traders-not-following-regulations-foodstuffs-being-prepared-in-a-harsh-way/