ధర్మాన ఎందుకు మెట్టు దిగారు?

Spread the love

YSRCP Dharmana Prasada Rao: ఉత్తరాంధ్రలో సీనియర్ నేత ఆయన. శ్రీకాకుళం జిల్లా వైసిపికి ఇన్నాళ్ళు దిక్సూచిగా ఉన్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత అజ్ఞాత వాసి అవతారం ఎత్తారు.. మరో రెండున్నరేళ్ళు రాజకీయం ఊసే ఎత్తను అంటూ తన అనుయాయుల దగ్గర చెప్పుకోచ్చేవారు.. ఇంతలోనే ఆ అజ్ఞాతవాసి మాట తప్పారు.. బెట్టు వీడి మెట్టు దిగారు.. ఆయన సీట్ పై ఆశ పెట్టుకున్న నేతలంతా తూచ్.. ఇది తొండాట.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.. అసలు ఎవరా అజ్ఞాతవాసి.. అయన చేసిన పాలిట్రిక్స్ ఏంటో చూద్దాం రండి.

ఈయన పేరు ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటీషియన్.. నిన్న మొన్నటి దాకా.. శ్రీకాకుళం జిల్లా వైసిపికి పెద్ద దిక్కుగా ఉండేవారు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.. రాష్ట రాజకీయాల్లో సైతం మంత్రిగా తనదైన ముద్ర వేసిన ఘనాపాటి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాలో తనమాటే నెగ్గాలి.. తనమాటే శాశనం అవ్వాలి అన్న తరహాలో కాంగ్రెస్ లో ఉండేవరకు రాజకీయం నడిపారు.. అప్పట్లో జిల్లాలో ధర్మానను ప్రసన్నం చేసుకుంటేనే టికెట్టు అనే విధంగా వ్యవహారం నడిచేది.. అయితే ధర్మాన వైసిపిలోకి వచ్చిన తరువాత ఈయన మాటకు విలువ అంతంతమాత్రంగానే ఉండేది.

దీంతో ఈయన్నే నమ్ముకున్న క్యాడర్ కు సైతం ఆశించిన పదవులు అందనంత దూరంగా ఉండేవి… ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నికల ముందు ధర్మాన నడిపిన రాజకీయం మరో ఎత్తు.. 2024 సాధారణ ఎన్నికలకు వినూత్నమైన ప్లానింగ్ తో ప్రజల్లోకి వెళితే.. ప్రజలు ఆ పప్పులు ఉడకనివ్వలేదు.. తనకు రాజకీయాలు అవసరం లేదు.. ఏదో పార్టీ ప్రెజర్ తో మాత్రమే పోటీ చేస్తున్నా.. నాకు ఇదంతా అవసరం లేదు అంటూ ప్రచారం సందర్భంగా ప్రజల్లో క్యాంపెయినింగ్ నిర్వహించారు.. ధర్మాన రెస్ట్ కోరుకుంటున్నారేమో అని అర్ధం చేసుకున్న ప్రజలు.. అయన కోరుకుంటున్నట్టుగానే సీనియర్ పొలిటీషియన్ ధర్మాన కు రెస్ట్ ఇచ్చేశారు.. భారీ మెజారిటి తో ధర్మాన పై నిల్చున్న టిడిపి సర్పంచ్ గొండు శంకర్ ను గెలిపించారు.

ఇక్కడి దాకా జరిగింది ఒక తీరు అయితే.. ఓడిన తరువాత ధర్మాన ప్రవర్తించిన తీరు మరీ విడ్డూరంగా ఉండేది.. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైన ధర్మాన.. ఈ పద్నాలుగు నెలల్లో కనీసం ఒక్క పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. వైసిపి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు చేసిన ఒకటి అరా నిరసన కార్యక్రమాల్లో సైతం జిల్లాలో ఉన్న అందరు వైసిపి నేతలూ పాల్గొంటున్నా.. శ్రీకాకుళం నగరంలోనే ఉంటున్న ధర్మాన మాత్రం అలక బూని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండడంతో ధర్మాన పార్టీ మారుతారని జిలాలో జోరుగా ప్రచారం సాగింది. YSRCP Dharmana Prasada Rao.

తాను బెట్టు చేస్తే.. వైసిపి అధిష్టానం బుజ్జగిస్తుందని.. తనకు గతంలో మాదిరిగా శ్రీకాకుళం జిల్లాను శాశించే పొజిషన్ ఇస్తారని ధర్మాన అనుకోని ఉండొచ్చు బహుశా.. అయితే.. ఇన్ని డైలాగులు కొట్టిన ధర్మాన ప్రసాదరావు.. కొద్ది రోజుల క్రితం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తన అభిప్రాయాన్ని పార్టీ క్యాడర్ తో పంచుకున్నారు. పార్టీ మార్పుపై క్యాడర్ కు స్పష్టత ఇచ్చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పార్టీ మారే ఆలోచన తనకు లేదని వదంతులు నమ్మొద్దని కార్యకర్తలకు వివరించారు. మూడేళ్ళ దాకా రాజకీయాల్లోకి రాను అన్న వ్యక్తి.. మళ్ళీ ఇప్పుడు హడావిడి ఎందుకు చేస్తున్నారు చెప్మా అంటూ శ్రేణులు ఓ వైపు తలలు పట్టుకుంటూ ఉంటె.. మరో వైపు తమ నాయకుడు మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయినందుకు ధర్మాన అనుచరులు,అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తన మాట శాసనం.. అనే ధర్మాన ఎందుకు మెట్టు దిగారు అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఉత్తరాంధ్ర వైసిపికి అన్నీ తానై చూసుకున్న ఆ పార్టీ సీనియర్ నేత, జగన్ కు బంధువు అయిన విజయ సాయి రెడ్డి కొద్ది నెలల క్రితమే రాజకీయాలకు తాను గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళిపోతేనే కించిత్ కూడా అటువైపు చూడని జగన్.. రేపు తన వైపు చూస్తారా.. బెట్టు చేస్తే బుజ్జగిస్తారా అనే అనుమానం ధర్మానకు కలిగి ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ మెట్టు దిగిన ధర్మాన.. మళ్ళీ జగన్నామ స్మరణ చెయ్యడం మొదలు పెట్టి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్తావస్థను వీడి ధర్మాన మళ్ళీ యాక్టివ్ అవడంతో ధర్మాన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గం సీట్ పై ఆశలు పెంచుకున్న శ్రీకాకుళం వైసిపి శ్రేణులు డామిట్ కద అడ్డం తిరిగింది అంటూ బాధపడుతున్నారు.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/chevireddy-bhasker-reddy-and-venkatesh-naidu-is-a-key-figure-in-the-liquor-case-sit-officials/