నందికొట్కూరులో జాడలేని వైసీపీ నేతలు..?

Spread the love

YCP leaders in Nandikotkur: ఆ నియోజక వర్గంలో వైసిపి నేతల జాడ కనిపించడం లేదట. గత ఐదేళ్ల పాలనలో తెగ హడావుడి చేసిన ఇన్చార్జితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేత కూడా ఇప్పుడు పత్తా లేకుండా పోయారట. దీంతో వైసిపి క్యాడర్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకూ ఆ నియోజక వర్గం ఏంటి. కనిపించని ఆ నేతలు ఎవరు. వాచ్ దిస్ స్టోరీ.

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజక వర్గం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. గత వైసిపి పాలనలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అండదండలతో నియోజకవర్గంలో హడావుడి చేసిన ఆయన ఇప్పుడు కనిపించడం లేదని నందికొట్కూరు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని శాప్ చైర్మన్ పదవి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే హడావుడి చేసిన నేత ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదన్న చర్చ నియోజక వర్గంలో జరుగుతోంది.

నందికొట్కూరు నియోజకవర్గ టిడిపిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధి కుంటుపడుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏ అభివృద్ధి కార్యక్ర మాలు కూడా పెద్దగా జరగడం లేదట. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించాల్సిన నేతలు ఎవరు నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో ఈ నియోజక వర్గం అభివృద్ధికి దూరమవుతుందని జనం వాపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ఇద్దరు నేతల మధ్య ఉన్న విబేధాలతో కౌన్సిల్ సమావేశం రసాభాస మారింది. నంది కొట్కూరు టౌన్ అభివృద్ధికి ఇక్కడ చేసే తీర్మానాలే చాలా కీలకమని చెప్పాలి. కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి చేయాల్సిన టిడిపి నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహ రిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ధార పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికలప్పుడు తెరమీదకి వచ్చిన సుదీర్ ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి చుట్టంలా వస్తున్నారు తప్ప స్థానికంగా ఉండటం లేదు. కనీసం సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం అవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. యువనేతగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నియోజకవర్గంలో కనిపించక పోవడం, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభివృద్ధి కూడా పత్తా లేకుండా పోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. YCP leaders in Nandikotkur.

గత ప్రభుత్వ హయాంలో అరకొరగా అభివృద్ధి కార్యక్ర మాలు ఇక్కడ జరిగాయి. ప్రభుత్వ మారింది తప్ప ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో అభివృద్ధి అనేది ఏమాత్రం కనిపించడం లేదట. ఇప్పటికైనా అదికార పార్టీ నేతలు విబేధాలు వదిలేసి, నియోజకవర్గం కోసం పాటు పడాలని జనం కోరుతున్నారు.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/dharmana-prasada-rao-refutes-the-propaganda-of-changing-party-and-gives-clarity-that-he-will-remain-in-ysrcp/