
Polavaram AMC post: ఏఎంసీ చైర్మన్ పదవి ఆ నియోజకవర్గంలో టిడిపి, జనసేన నేతల మధ్య చిచ్చుపెట్టిందా..ఇప్పటివరకు అంతర్గతంగా జరుగుతున్న కూటమి నేతల మధ్య వివాదం ఒక్కసారిగా బయటపడిందా… సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారా.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఆ నియోజకవర్గంలో కుటమి నేతల మధ్య సైక్యత లేకపోవడానికి కారణం ఏంటంటారు. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే..
2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడానికి టిడిపి,జనసేన,బిజెపి కూటమిగా ఏర్పడ్డాయి రాష్ట్రంలో గత వైసిపి చేసిన అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి జనసేన నేత పవన్ కళ్యాణ్,ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించారు… వై నాట్ 175 అన్న జగన్ను 11 సీట్లకే పరిమితం చేశారు.. 2014లో కూటమిగా ఏర్పడ్డ జనసేన టిడిపి బిజెపి మధ్యలోనే అంతర్గత విభేదాలు నేపథ్యంలో కూటమి పొత్తు పటాపంచలైంది 2019 ఎన్నికల్లో ఎవరికి వారే విడిగా పోటీ చేశారు.. అప్పుడు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా కూటము పొత్తు ధర్మాన్ని పాటిద్దాం.కలిసిమెలిసి పనిచేద్దాం రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిపాలన అందిద్దామని జనసేన,టిడిపి అధినేతలు సైక్యతతో పనిచేస్తుంటే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, టిడిపి నేతల మధ్య అంతర్గత యుద్ధం మొదలైందని టాక్ వినిపిస్తుంది.. కొన్ని నియోజకవర్గాల్లో నేనంటే నేను అంటూ ప్రోటో కాల్ వివాదంతో పాటు నియోజకవర్గంలో తమ మనుగడ కోసం టిడిపి, జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి తమ స్వలాభాల కోసం అధిష్టానం మాట పక్కన పెట్టి ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష విపక్ష నేతలుగా మారుతున్నారని కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు టిడిపి జనసేన నేతలకు పొత్తు కుదరడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం కూటమి పొత్తు నేపథ్యంలో ఆ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. పోలవరం జనసేన నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చిర్రి బాలరాజుకు జనసేన అధిష్టానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది..అప్పటివరకు టిడిపి ఇన్చార్జిగా ఉన్న బోరగం శ్రీనివాసరావు ఎమ్మెల్యే సీటు టిడిపికి వస్తుంది తానే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తాను అనుకున్న సమయంలో పొత్తు ధర్మం శ్రీనివాసరావు ఆశలలో నీళ్ళు పోసింది.. దీంతో అనూహ్యంగా తెరపైకి వచ్చిన జనసేన చిర్రి బాలరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన నేతల మధ్య కూడా పెద్ద వారే జరిగింది.. పోలవరం నియోజకవర్గం సీటు ఆశించిన టిడిపి శ్రీనివాసరావు సీటు జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకించి నిరసనలు చేపట్టారు.. పార్టీ పెద్దలు పోలవరం నియోజకవర్గంలో పర్యటించి ఇద్దరి మధ్య సక్యత కుదిర్చారు.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా పోలవరం నియోజకవర్గంలో ఒక టీం ఏర్పాటు చేసి టిడిపి జనసేన నేతలను కలుపుకుని అక్కడ విజయానికి కృషి చేశారు.. పోలవరం టిడిపి ఇన్చార్జిగా ఉన్న బొరగం శ్రీనివాసరావుకు ట్రైకర్ చైర్మన్ పదవిని పార్టీ అధిష్టానం కట్టబెట్టింది.. Polavaram AMC post.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పోలవరం నియోజకవర్గంలో రెండు పార్టీ నేతలు ఆధిపత్య పోరుకు తెరలేపరట.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ టిడిపి ఇన్చార్జిగా మారిందట.. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు తమ మార్క్ చూపేందుకు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు జనసేన, టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారట.. పోలవరం నియోజకవర్గంలో టిడిపి జనసేన నేతలు మధ్య రగడ పార్టీ పెద్దలకే తలనొప్పిగా మారిందట.. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నామినేట్ పదవుల కేటాయింపులోనూ రెండు పార్టీ నేతలు మధ్య వివాదం చెలరేగిందట.. ఏఎంసీ చైర్మన్ పదవిని కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుకు తెలియకుండానే ఏఎంసి పదవిని టిడిపి నేతకు కట్టబెట్టారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారట ఇటీవల పోలవరం ఏఎంసీ చైర్మన్ పదవిని మంగ పొట్ట రామారావుకు కేటాయించారు.. అయితే ఎమ్మెల్యే బాలరాజును పక్కనపెట్టి టిడిపి ఇంచార్జ్ శ్రీనివాసరావు తనకు నచ్చిన విధంగా పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి ఏఎంసీ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారని జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారట.. ఏఎంసీ చైర్మన్ పదవిని టిడిపికి కేటాయించడాన్ని ఏడు మండలాల జనసేన కార్యకర్తలు ఖండిస్తున్నామని టిడిపి ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని ఇలాగే కొనసాగితే రోడ్డెక్కే పరిస్థితులు ఉంటాయని.. హెచ్చరిస్తున్నారట.. సోషల్ మీడియా వేదిక తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీనివాసరావు పై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారట. ఎమ్మెల్యే బాలరాజుకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకున్న నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు అంతా కలిసి నిరసనలు చేస్తామని అవసరమైతే టిడిపి ఇన్చార్జి పదవిని ఊడగొడతామంటూ హెచ్చరిస్తున్నారట..
ఇదిలా ఉంటే టిడిపి నేతలు గత సంవత్సర కాలం నుంచి నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం పొత్తు ధర్మంగా తమకు గౌరవం ఇవ్వడం లేదని టిడిపి ఇన్చార్జి శ్రీనివాసరావును పక్కన పెట్టారని.. కనీసం నియోజకవర్గంలో పథకాల ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించడం లేదని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నామినేట్ పదవుల సైతం ఎక్కువగా జనసేన నేతలకే కేటాయించారని,ఏఎంసీ చైర్మన్ పదవి టిడిపికి కేటాయించడాన్నీ జనసేన నేతలు వ్యతిరేకిస్తూ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారట టిడిపి నేతలు..తాము కూడా నియోజకవర్గంలో బలంగా ఉన్నామని అవసరమైతే జనసేనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారట… కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే పోలవరం నియోజకవర్గంలో టిడిపి జనసేన నేతల మధ్య కుమ్ములాట తారా స్థాయికి చేరడంతో ఇంకా నాలుగు సంవత్సరాల పాటు రెండు పార్టీ నేతలు నియోజకవర్గంలో కలిసి ఎలా పనిచేస్తారని ఇలా ఉంటే కూటమి బంధాలు మధ్యలోనే తెగిపోతాయని దానికి నిదర్శనం పోలవరం నియోజకవర్గం లోని టిడిపి జనసేన నేతల మధ్య జరుగుతున్న వివాదమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు… ఎప్పటికైనా రెండు పార్టీలు అధినేతలు ఈ నియోజకవర్గంలో దృష్టి సారించి ఇక్కడ జరుగుతున్న జనసేన టిడిపి కోల్డ్ వార్ ను చక్కదిద్దాలని కోరుతున్నారు…