కోట్లు స్వాహా చేసిన వైసీపీ నేత ఎక్కడా.?

Spread the love

PD Act on Dal mil Suri: ప్రస్తుత కాలంలో మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రకరకాల మార్గాల్లో నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. తుక్కు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి పలువురితో పెట్టుబడులు పెట్టించాడో వైసీపీ నేత . అధిక లాభాలకు ఆశపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టాడు. కోట్లాది రూపాయలు తీసుకొని ఉడాయించాడు. ఇంతకి ఎవరా నేత తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని నుంచి అందినకాడికి దండుకున్నాడు. అనే తరహాలో.. కోట్లాది రూపాయలు మోసాలు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కొత్తచెరువుకు చెందిన వైసీపీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు పోలీసులు.. ఈ వ్యవహారంపై సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పలు విషయాలు వెల్లడించారు. జిల్లాలో వివిధ వ్యాపారా పేరుతో కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడ్డ వైసీపీ నేత దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు..

గతంలోను ధాన్యం కొనుగోలు పేరిట దాల్ మిల్ సూరి మోసం చేశారంటూ.. తాడిపత్రికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పంటలు పండించి దాల్ మిల్ సూరికి అమ్మితే 40 మందికి కలిపి మొత్తం కోటి 30 లక్షలు ఎగ్గొట్టారని వాపోయారు. న్యాయం చేయాలంటూ కొత్తచెరువు నెహ్రూ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కొత్తచెరువు పోలీస్ స్టేషన్ లో దాల్ మిల్ సూరిపై ఫిర్యాదు చేశామని……. ఇప్పటికే అతనిపై పలు చీటింగ్ కేసులు ఉన్నాయని రైతులు చెప్పారు. అప్పులు చేసి పంటలు పండించామని……. దయచేసి తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించాలని రైతులు వేటుకుంటున్నారు. PD Act on Dal mil Suri.

ఇక, దాల్‌ మిల్‌ సూరిపై కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో 16 కేసులు నమోదయ్యాయని తెలిపారు ఎస్పీ రత్న.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు. అయితే మరోవైపు, దాల్‌మిల్‌ సూరి ఆచూకీ తెలపాలంటూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తున్నాం అని వెల్లడించారు జిల్లా ఎస్పీ రత్న.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/fight-within-the-alliance-for-the-polavaram-amc-post/