26 ఏళ్ల పగ..!

Spread the love

US Reward for Nicolas Maduro: అమెరికా ఒకసారి గురి చూసిందంటే.. దాన్ని సాధించేవరకు విడిచిపెట్టదు. ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా ఓ దేశాధ్యక్షుడినే అరెస్టు చేసేందుకు సహకరిస్తే రూ.430 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. ఇంతకు ఎవరా దేశాధ్యక్షుడు అసలు ఆయన చేసిన నేరం ఏమిటీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ..

ఓ దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేసేందుకు సహకరిస్తే భారీగా సొమ్ము ముట్టజెబుతామని అగ్రరాజ్యం అమెరికా ఆఫర్ ను ప్రకటించింది. కొన్నేళ్లుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది. మదురో అరెస్టుకు అవసరమైన సమాచారం ఇచ్చినవారికి ఏకంగా రూ. 430 కోట్లు ఇస్తామని పేర్కొంది. అమెరికా గతంలో ఎన్నో దేశాల అధ్యక్షులను టార్గెట్ చేసి వారినే నేలకూల్చింది. ఇప్పుడు వెనెజులా దేశ అధ్యక్షుడుపై కత్తులు నూరుతోంది.

అగ్రరాజ్యం అమెరికా లో డ్రగ్స్ వ్యాప్తిని, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గత కొన్నేళ్లుగా వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మడురో పై అగ్రరాజ్యం ఫైర్ మీద ఉంది. ఈ నేపథ్యంలో మడురోను అరెస్టు చేయాలని చూస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఈ రికార్డు 15 మిలియన్ డాలర్లుగా ఉంది. జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచారు. తాజాగా ఆ మొత్తాన్ని 50 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అమెరికా అటార్నీ పేర్కొన్నారు. అమెరికాలో డ్రగ్స్‌ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్‌ మడురో.. ట్రెన్‌ డె అరాగువా, సినలో, కార్టల్‌ ఆఫ్‌ ది సన్స్‌ వంటి వాటిని వినియోగిస్తున్నారని పామ్ బాండీ ఆరోపించారు.

అమెరికా చెబుతున్న ప్రకారం నికోలస్, ఆయన స్నేహితులకు సంబంధించిన కోకైన్ ను అమెరికా డ్రగ్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ పట్టుకున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆ కొకైన్ 30 టన్నులు ఉంటుందని అంటున్నారు. అందులో 7 టన్నుల కొకైన్ నికోలస్ మదురోకు చెందినదని వారు వాదిస్తున్నారు. వెనెజులాలో డ్రగ్స్, స్మగ్లింగ్ చేయడం ద్వారా ఆయన భారీగా ఆర్జిస్తున్నారని అమెరికా చెబుతోంది. కొకైన్ మాత్రమే కాదు ఇంకెన్నో మత్తుపదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని మండి పడిపోతుంది. గతంలో బైడెన్ ప్రభుత్వం కూడా మదురో పై ఇవే ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ కు ఉన్నంత దూకుడు… బైడెన్ కు లేదు. ట్రంప్ యూఎస్ అధ్యక్షుడు అయిన తర్వాత మదురో సంగతి తేల్చేటట్టే కనిపిస్తున్నాడు. ట్రంప్ నుంచి నికోలస్ తప్పించుకోలేడని అమెరికా అధికారులు కూడా చెబుతున్నారు. US Reward for Nicolas Maduro.

వెనిజులా – అమెరికా మధ్య వివాదం దాదాపు 26 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 1999లో హ్యూగో చావెజ్ వెనిజులా పగ్గాలు చేపట్టారు. ఆయన అధ్యక్షుడైన వెంటనే అమెరికాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంతో ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే అమెరికా తిరుగుబాటుకు కూడా ప్రయత్నించింది.. అయితే అది సక్సెస్ కాలేక పోయింది. అమెరికాను ఇబ్బంది పెడుతున్న కమ్యూనిస్ట్ భావజాలం విత్తనాలను చావెజ్ నాటాడని చెబుతారు. ఆ తర్వాత చావెజ్ అనేక సందర్భాల్లో అమెరికన్ అధ్యక్షులను విమర్శించారు. వెనిజులా అధ్యక్షుడు మదురో చావెజ్ శిష్యుడని చెబుతారు. ఆయన 1999 నుండి 2013 వరకు ప్రభుత్వంలో ఉన్న చావెజ్‌కు అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరు.

ఆయన చాలాకాలం పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. తరువాత ఉపాధ్యక్షుడయ్యారు, 2012లో చావెజ్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, తనకు ఏదైనా జరిగితే, తదుపరి అధ్యక్షుడిగా మదురోను ఎన్నుకోవాలని ఆయన క్లారిటీ ఇచ్చారు. 2013లో చావెజ్ మరణం తర్వాత, మదురో తాత్కాలిక అధ్యక్షుడయ్యారు, తరువాత ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. నికోలస్ మదురో, ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్‌ను సీజ్ చేసినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్‌బాండీ తెలిపారు. వీటిల్లో 7 టన్నులతో స్వయంగా మదురోకు సంబంధం ఉందని పేర్కొన్నారు.

వెనుజువెలా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని బాండీ వెల్లడించారు. మదురోను మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాకు కింగ్‌పిన్‌గా అభివర్ణించారు. అమెరికాలో మాదకద్రవ్యాల వ్యాపారం మదురో మద్దతుతో నడుస్తోందన్నారు. దీనితో పాటు ఆయనపై అక్రమ ఇరానియన్ వలసదారులను అమెరికాకు పంపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే మదురోపై 15 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. తర్వాత బైడెన్ సర్కార్ దానిని 25 మిలియన్ డాలర్లకు పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్‌పెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన 700 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిల్లో ప్రైవేట్ జెట్లు, తొమ్మిది వాహనాలు ఉన్నాయి. ఇప్పటికే 2020 మార్చిలో మదురోపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కేసులు నమోదయ్యాయని, ట్రంప్ నాయకత్వం నుంచి మదరో తప్పించుకోలేరని బాండీ పేర్కొన్నారు.

అమెరికా వేరొక దేశ అధ్యక్షుడిపై విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఏకంగా ఒక దేశ అధ్యక్షుడిపై ప్రైజ్ మనీనే ప్రకటించడం పై ఆసక్తి నెలకొన్నది. నికోలస్‌ మడురో అరెస్ట్ కు ఎవరైనా సహకరిస్తారా లేదా అనిది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also Read: https://mega9tv.com/international/a-american-doctor-carl-tanzler-love-story-with-elena-la-condesa-de-cosel/