
H1B Visa Guide Lines: అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారికి బిగ్ రిలాక్స్.. కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు కట్టాలని ఇప్పటికే బాంబు పేల్చిన అమెరికా, ఈ వీసా కార్యక్రమంలో మరిన్ని మార్పులకు రెడీ అయ్యింది. హెచ్-1బీ వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఈ ఫీజు ల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవును ఇది నిజం. హెచ్-1బీ ఫీజు అంశంలో అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది . అమెరికా బయటి నుంచి వచ్చే కొత్త దరఖాస్తులకు మాత్రమే హెచ్ -1 బీ ఫీజు లక్ష డాలర్లు చెల్లించాలని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ క్లారిటీ ఇచ్చింది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులకు హెచ్-1బీలో సవరణలు, పొడిగింపులు లేదా స్టేటస్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో మినహాయింపు ఇస్తూ యూఎస్సీఐఎస్ నవీకరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఇప్పటికే ఉంటున్న భారత విద్యార్థులకు బిగ్ రిలాక్సే అనుకోవాలి.
యూఎస్సీఐఎస్ చేసిన ప్రకటన ప్రకారం, అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది. దీనిప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 21న హెచ్1బీ వీసాపై చేసిన ప్రకటన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది.
హెచ్-1బీ ఫీజు చెల్లింపుల కోసం ఆన్‌లైన్ సేవలు ప్రారంభించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఎఫ్-1 విద్యార్థి వీసా హోల్డర్లు హెచ్-1బీకి మారాలనుకునే వారితో పాటు, ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో అమెరికాలో ఉన్నవారికి ఈ లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఎల్-1 వీసాతో ఉన్న ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది. ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారత విద్యార్థులకు భారీ ఊరట దక్కనుంది. అమెరికా బయటి నుంచి వచ్చే కొత్త H-1B దరఖాస్తులపై మాత్రమే రుసుం ఉంటుదని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పలు పరిశ్రమలు లేదా వృత్తులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందా అనే విషయమై అస్పష్టత నెలకొంది.
హెచ్-1బీ వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది.
కాబట్టి నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు. జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్-1990 అమల్లోకి వచ్చింది.
అమెరికా జారీ చేసే వీసాలు ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి ఇమిగ్రేషన్ రెండు నాన్-ఇమిగ్రేషన్. అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఇమిగ్రేషన్ వీసాలు ఇస్తారు.దీనికి కొన్ని అర్హతలుండాలి. అమెరికాలో తాత్కాలికంగా కొంత కాలం ఉండేందుకు ఉద్దేశించినవి నాన్-ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి హెచ్-1బీ వీసా నాన్-ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది. అమెరికా ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో మాత్రమే హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. ఇవి మూడు విభాగాలుగా ఉంటాయి. సాధారణంగా ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తారు. వీటిని జనరల్ కోటా అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్స్ అంటే అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. వీటికి అందరూ దరఖాస్తు చేసుకోలేరు. ఇక రిజర్వ్‌డ్: స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా సింగపూర్, చిలీ దేశాలకు ఏడాదికి 6,800 వీసాలను రిజర్వ్ చేసి ఉంచారు.
హెచ్-1బీ వీసాలకు డిమాండు బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్‌గా వీటిని ఎంపిక చేస్తుంది. తమ ఉద్యోగుల కోసం సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తుంటాయి. అలాగే మరి కొన్ని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి. ఇక ఒకసారి హెచ్-1బీ వీసా లభిస్తే మూడేళ్లపాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ కాల పరిమితిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ మొత్తం మీద ఆరేళ్లకు మించకూడదు. హెచ్-1బీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు డిపెండెంట్ వీసా ద్వారా అమెరికాలో ఉండొచ్చు. ఇందుకు వారు హెచ్-4 వీసాలను తీసుకోవాలి. జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు పిల్లలకు ఈ అవకాశం ఉంటుంది. హెచ్-4 వీసా ఉన్న కుటుంబ సభ్యులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ వీసా మీద ఎటువంటి ఉద్యోగాలు చేయడానికి లేదు. ఇందుకు వర్క్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది వీసా డిటెల్స్.
హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు కట్టాలని ఇప్పటికే బాంబు పేల్చిన అమెరికా, ఈ వీసా కార్యక్రమంలో మరిన్ని మార్పులకు రెడీ అవ్వడంతో అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారు పెంచిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో ఆందోళన చెందనక్కర్లేదు. హెచ్1బీ వీసా కోసం పెంచిన ఫీజు బయటి దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులకే వరిస్తుంది. దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు. అయితే, హెచ్-1బీ వీసా ఫీజు ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. కానీ ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఏకంగా దానిని రూ.88 లక్షలకు పెంచింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్న వారికి వర్తించదని తెలిపింది. H1B Visa Guide Lines.
కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. ప్రస్తుతం హెచ్-1బీ వీసాలు ఉన్నవారు భారత్ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పనిలేదని చెప్పింది. తాజాగా అమెరికా నుంచి కాకుండా బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని యూఎస్సీఐఎస్ స్పష్టం చేయడంతో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.