
Bihar RJD Candidate list: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో సీట్ల పంపకాలపై నెలకొన్న తీవ్ర గందరగోళం మధ్య రాష్ట్రీయ జనతా దళ్ దూకుడు ప్రదర్శించింది. కాంగ్రెస్‌తో తుది ఏకాభిప్రాయం కుదరకముందే.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏకపక్షంగా 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ జాబితా ప్రకారం.. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ స్థానం నుంచి మరోసారి పోటీకి దిగుతున్నారు. ఆ డిటేల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగియనున్నప్పటికీ.. విపక్ష మహాగఠ్‌బంధన్‌లో సీట్ల పంపకాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై మంతనాలు కొనసాగుతుండగానే… లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్జేడీ ఏకంగా 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది.
ఆర్జేడీ అగ్రనేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మరోసారి తన పాత స్థానం అయిన వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 121 మంది అభ్యర్థులను నాలుగో విడత జాబితాలో 12 మందితో కలిపి బరిలోకి దింపుతుంది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ కారణంగానే మహాగఠ్‌బంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ఉమ్మడి ప్రకటన చేయలేకపోయింది. అంతేకాకుండా తొలిదశ పోలింగ్ జరగనున్న 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం పార్టీల మధ్య ఉన్న సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. ఇదిలా ఉండగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఇటీవల ఆరు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం మహాగఠ్‌బంధన్‌కు మరో ఎదురుదెబ్బగా మారింది.
కాగా, ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఆర్జేడీకి, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీనేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగడం వల్లే ఇలా జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. దీని వల్లే ఇప్పటివరకు మహాగఠ్‌బంధన్ ఇంతవరకూ సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు.. తొలివిడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపింది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. బిహార్‌లో నవంబరు 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 14న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అయినా ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు.
ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ, సీపీఐ ఎల్, సీపీఐ , సీపీఐ, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ తొలి దశలో మొత్తం 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు ఇండి కూటమిలో సీట్ల పంపకాల విషయంలో సమస్యలున్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ వెల్లడించారు. ఈ సమస్యలను చర్చల ద్వారా తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అయితే తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీతోనే ముగిసింది.
243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడుతాయి. అయితే ఈ ఎన్నికల ద్వారా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్డీయే భావిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఇండి కూటమి కృత నిశ్చయంతో ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన తెలనుంది. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాకర్త, జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఇప్పటికే తెలిపారు. Bihar RJD Candidate list.
మరోవైపు అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా సాగింది. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ కి 29, హిందుస్థానీ అవామ్ మోర్చా , రాష్ట్రీయ లోక్ మోర్చా లకు చెరో ఆరు సీట్లను కేటాయించారు. JDU ప్రకటించిన 101 స్థానాల్లో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కలిపి 59 సీట్లు కేటాయించారు. దాదాపుగా మంత్రులందరికీ టిక్కెట్లు లభించగా, మహిళలకు కేవలం 13 స్థానాల్లోనే అవకాశం దక్కింది. ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఈ ఎన్నికలతో ఎవరు అధికారాన్ని దక్కించు కుంటారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..