
Pakistan Jaish E Mohammed: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలం అయిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన నెట్ వర్క్ ను విస్తరించుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతోంది. ఆ సంస్థ తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో ఓ ఉగ్రవాద దళం కోసం జైషే మహిళా బ్రిగేడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చావు దెబ్బ తిన్నది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ బహవల్పూర్లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం సుభాన్ అల్లా క్లాంపెక్స్ భవనంపై భారత సైన్యం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుభాన్ అల్లా కాంప్లెక్స్ నామారూపాల్లేకుండా పోవడమే కాకుండా.. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీలో దాదాపు 10 మంది హతమయ్యారు.
దీనితో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పీవోకేల్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. ముఖ్యంగా పాకిస్థాన్ బహవల్పూర్లోని జైషే-మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని వైమానిక దళం సర్వనాశనం చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించారు. అందులో సాదియా భర్త యూసుఫ్ అజార్ కూడా ఉన్నాడు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉమర్ ఫరూఖ్ భార్య అఫ్రీర్ ఫరూఖ్ కూడా ఇప్పుడు ఉగ్రకార్యకలాపాల్లో చురుకుగా ఉంటోంది.
అయితే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా జైష్-ఎ-మొహమ్మద్ బుద్ధి మారలేదు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు నాలుగైదు నెలలపాటు కార్యకలాపాలు నిలిపేసిన జైష్-ఎ-మొహమ్మద్ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ సారి మరో కొత్త కుట్రకు తెరలేపుతున్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గ్రూప్ నెట్ వర్క్ విస్తరణలో భాగంగా.. జేషే తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో కూడిన ఉగ్రవాద దళం కోసం జమాత్ ఉల్-ముమినాత్ పేరుతో మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ ఫైండ్ఔట్ చేసింది.
ఇక ఇందులో భాగంగా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రసంస్థ జైషే-మొహమ్మద్ బరితెగించింది. మహిళను ఉగ్రవాదులుగా మార్చేందుకు కొత్తగా ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. దీనికి “తుఫత్-అల్-ముమినాత్” అని పేరుపెట్టింది. జీహాద్ కోర్సు అని దాని అర్ధం. అంతేకాదు దీని ఫీజును 500 పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించింది. గత నెలలో బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో జరిగిన బహిరంగ సమావేశంలో కనిపించిన మసూద్ అజార్ ఇప్పుడు తన ఉగ్రవాద కార్యకలాపాల కోసం విరాళాలు సేకరించే పనిని ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే మహిళల కోసం ఒక ఆన్లైన్ కోర్సు పెట్టి ఒక్కొక్కరి నుంచి 500 పాకిస్థానీ రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ‘జైషే-మొహమ్మద్’ గ్రూప్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు “జమాత్ – ఉల్-ముమినాత్” అనే మహిళా విభాగాన్ని సృష్టించింది. అంతేకాదు తమ టెర్రర్ గ్రూప్‌నకు అవసరమైన నిధులు సేకరించేందుకు, నియామకాలు చేపట్టేందుకు, ముఖ్యంగా మహిళలను తమలో చేర్చుకుని ఉగ్ర శిక్షణ ఇచ్చేందుకు “తుఫత్-అల్-ముమినాత్” అనే ఆన్లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో చేరిన వారికి జైషే-మొహమ్మద్ గ్రూప్‌నకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదాలు శిక్షణ ఇస్తారు. అందులో ప్రధానమైనవాళ్లు జైషే-మొహమ్మద్ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్‌కు చెందిన బంధువులు, కమాండర్లు. వీరు మహిళలకు జీహాద్ గురించి, ఇస్లాం గురించి బోధిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ఆన్లైన్లో నియామకాలు చేపడతారు. నవంబర్ 8 నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుంది అని సమాచారం.
కోర్సు ఎలా ఉంటుందంటే….ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ఉగ్ర పాఠాలు బోధిస్తారు. వీటిని అజార్ సిస్టర్స్ అయిన సదియా అజార్, సమైరా అజార్ బోధిస్తారు. వారు మహిళలు కచ్చితంగా ‘జమాత్-ఉల్-ముమినాత్’లో చేరాలని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మసూద్ అజార్ చెల్లెలు సదియా అజార్‌కు ఈ విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం పాకిస్థాన్‌లో మహిళలు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని భావిస్తుంటారు. అలాంటిది ఓ ఉగ్రసంస్థ నేరుగా మహిళల కోసం ఆన్లైన్ జిహాదీ కోర్సు పెడితే, ఏమీ తెలియనట్లు కళ్లు మూసుకుని ఉంది. ఇది పాక్ వక్రబుద్ధిని బయటపెడుతోంది.
మసూద్ అజార్ అక్టోబర్ 8న జమాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 19న పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన మహిళలను తమ ఉగ్ర విభాగంలోని తీసుకువచ్చేందుకు ‘దుఖ్తరన్-ఏ-ఇస్లాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదంతా చూస్తే మగ ఉగ్రవాదుల వల్ల కానిది, ఆడ ఉగ్రవాదులతో సాధించాలని మసూద్ అజార్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. Pakistan Jaish E Mohammed.
అయితే మహిళా బ్రిగేడ్ గ్రూప్ బాధ్యతలను మసూద్ అజర్ తన చెల్లెలు సాదియా, సమైరా చేతిలో పెట్టినట్లు సమాచారం. సాదియా భర్త యూసప్ అజార్, సమైరా భర్త ఉమర్ ఫరూక్ ఇద్దరూ కూడా ఉగ్రవాదులే. పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుడే ఈ ఉమర్ ఫరూక్. వీరిద్దరూ భారత సైన్యం చేతిలోనే హతం కావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌లో యూసప్, ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్లో ఉమర్ ఫరూక్ కుక్క చావు చచ్చారు. ఆత్మాహుతి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా జైషే ఈ మహిళా బిగ్రేడ్ ను ఏర్పాటు చేస్తోన్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు ఈ మేరకు అలర్ట్ అయ్యాయి.