విముక్తి.!

Spread the love

Saudi India Liberation: ఎన్నో ఏళ్ళుగా బానిసత్వంలో మగ్గిపోతున్న బారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలో మగ్గిపోతున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ దేశంలో ఉన్న కఫాలా వ్యవస్థ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దాదాపు 1.3 కోట్ల వలసదారులకు భారీ ఊరట లభించింది. ఇందులో భారతీయులే 25లక్షల వరకు ఉంటారు. ఇంకా పూర్తి డిటేల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లుగా అమల్లో ఉన్న ‘కఫాలా’ వ్యవస్థ బ్యాన్ చేస్తూ ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సౌదీలోని కోటీ 30 లక్షల మంది విదేశీ వర్కర్లకు విముక్తి లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీసుకొచ్చిన విజన్ 2047 లో భాగంగా ఈ పాత విధానాన్ని నిర్మూలించారు. దీంతో సౌదీ అరేబియా ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన భావిస్తున్నారు.

కఫాలా స్పాన్సర్‌షిప్ వ్యవస్థను 1950లో తీసుకొచ్చారు. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల ప్రవాహాన్ని నిర్వహణ కోసం దీనిని రూపొందించారు. గల్ఫ్ దేశానికి ఉపాధికోసం వెళ్లేవారు స్థానిక స్పాన్సర్ (కఫీల్)తో ముడిపడి ఉంటారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదాపై దాదాపు పూర్తి నియంత్రణ కఫీల్‌కేఉంటుంది. పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించడం, ఉద్యోగాలు మారాలన్నా, దేశం విడిచి వెళ్లాలన్నా వారి అనుమతి వంటి నిబంధనల కారణంగా ఇదో ఆధునిక బానిసత్వ వ్యవస్థగా మానవహక్కుల సంఘాలు తరుచూ విమర్శలు గుప్పిస్తున్నాయి. స్పాన్సర్‌షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమరవాణాకు ప్రోత్సహిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ సహా పలు ప్రపంచ సంస్థలు ఆరోపణలు చేశాయి.

ఉదాహరణకు కర్ణాటకకు చెందిన 46 ఏళ్ల నర్సు జసింతా మెండోన్సా కేసును తీసుకుంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమెను 2016లో ఏజెంట్లు ఖతార్‌కు పంపారు. అక్కడ నుంచి సౌదీ అరేబియాకు అక్రమంగా తరలించగా.. ఆమెను విడుదల చేయాలంటే రూ.4.3 లక్షలు కట్టాలని ‘కఫీల్’డిమాండ్ చేశాడు. చివరికి దౌత్య, న్యాయ మార్గాల ద్వారా ఆమె విడుదలయ్యారు. మెండోన్సా ఉదంతం గల్ఫ్ దేశాలకు వెళ్లి త్వరగా డబ్బు సంపాదించి తిరిగి రావాలని కలలుగన్న భారత యువతలో చాలామంది ఎదుర్కొన్న దురదృష్ట ఘటనల్లో ఒకటి. తాజాగా, సౌదీ అరేబియా కఫాలా వ్వవస్థను రద్దుచేయడంతో ఇలాంటి భయానక ఘటనలకు ముగింపు పడనుంది. ఇప్పటికే ఇజ్రాయెల్, బహ్రెయిన్ ఈ వ్యవస్థను రద్దుచేశాయి. కానీ, కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతోంది. ఈ దేశాల్లోని దాదాపు 2.5 కోట్ల మంది మంది విదేశీ కార్మికులు కఫాలా వ్యవస్థ కింద పనిచేస్తుండగా.. వీరిలో 75 లక్షల మంది భారతీయులే.

కఫాలా వ్యవస్థ.. ఓ విధంగా మానవ అక్రమ రవాణా లాంటిది. ఇది మోడ్రన్ డే బానిసత్వంగా అభివర్ణిస్తారు. గత 50 ఏళ్లకు పైనుంచి ఈ విధానం సౌదీలో అమల్లో ఉంది. ఈ విధానంలో భాగంగా యజమానికి విదేశీ వర్కర్లపై పూర్తి అధికారం, నియంత్రణ ఉంటుంది. వారి పాస్ పోర్టులు లాక్కుని గొడ్డు చాకిరీ చేయించుకోవడమే వీరి పని. వర్కర్లను బానిసలుగా మార్చుకుని వారితో చేయకూడని పనులన్నీ చేయించుకోవడం.. అలాగే వారికి ఇష్టం వచ్చిన పనిలో వారిని పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ వ్యవస్థ సౌదీ ప్రతిష్టను నానాటికీ దిగజార్చుతోందని గ్రహించిన ఆ దేశ యవరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కఫాలా వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో ఆ దేశంలో దాదాపు కోటి 30 లక్షల మంది విదేశీయులకు విముక్తి, ఊరట లభించింది. వీరిలో దాదాపు 25 లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరికి విముక్తి లభించినట్లుగా చెప్పొచ్చు. విజన్ 2030 నాటికి ఆ దేశ యువరాజు తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీనితో సౌదీ ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు పొందడంతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తాయని ఆశిస్తున్నట్లు సమాచారం.

సౌదీలో ఈ వ్యవస్థ 1950లో అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన కార్మికులను మానిటరింగ్ చేయడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రతి వర్కర్ ను కఫీల్(ప్రొఫెసర్) కు అప్పజెప్తారు. అతను.. ఆ వర్కర్ ఉపాధి, వేతనం, బస తదితర వస్తువులను చూసుకుంటాడు. అయితే ఈ వ్యవస్థలో కార్మికులు తమ పై అధికారులపై ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. ఈ వ్యవస్థ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అనేకమంది భారతీయ మహిళలు తమ దాడులకు సిద్ధమయ్యారు. గుజరాత్‌కు చెందిన మహిళలు సౌదీలో ఇబ్బంది పడినప్పుడు 2017లో కేంద్రం జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. Saudi India Liberation.

సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి. స్వచ్ఛంద, సహాయ సంస్థల నివేదికలు, కీలకమైన విదేశీ పెట్టుబడుదారుల అసంతృప్తి ప్రభావితం చేశాయి. కానీ, చివరికి ఇది యువరాజు తీసుకున్న నిర్ణయం. దీని వెనుక సౌదీ అరేబియా ప్రపంచ స్థాయి ఆశయాలే ప్రధాన కారణం.