బరితెగింపు.!

Spread the love

Pakistan Jaish E Mohammed: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలం అయిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన నెట్ వర్క్ ను విస్తరించుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతోంది. ఆ సంస్థ తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో ఓ ఉగ్రవాద దళం కోసం జైషే మహిళా బ్రిగేడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎తో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చావు దెబ్బ తిన్నది. పాకిస్తాన్‎లోకి చొచ్చుకెళ్లి మరీ బహవల్‌పూర్‌‎లో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం సుభాన్ అల్లా క్లాంపెక్స్ భవనంపై భారత సైన్యం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుభాన్ అల్లా కాంప్లెక్స్ నామారూపాల్లేకుండా పోవడమే కాకుండా.. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీలో దాదాపు 10 మంది హతమయ్యారు.

దీనితో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్​, పీవోకేల్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. ముఖ్యంగా పాకిస్థాన్​ బహవల్​పూర్​లోని జైషే-మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని వైమానిక దళం సర్వనాశనం చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్​ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించారు. అందులో సాదియా భర్త యూసుఫ్ అజార్ కూడా ఉన్నాడు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉమర్​ ఫరూఖ్​ భార్య అఫ్రీర్​ ఫరూఖ్​ కూడా ఇప్పుడు ఉగ్రకార్యకలాపాల్లో చురుకుగా ఉంటోంది.

అయితే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా జైష్-ఎ-మొహమ్మద్ బుద్ధి మారలేదు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు నాలుగైదు నెలలపాటు కార్యకలాపాలు నిలిపేసిన జైష్-ఎ-మొహమ్మద్ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ సారి మరో కొత్త కుట్రకు తెరలేపుతున్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గ్రూప్ నెట్ వర్క్ విస్తరణలో భాగంగా.. జేషే తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో కూడిన ఉగ్రవాద దళం కోసం జమాత్ ఉల్-ముమినాత్ పేరుతో మహిళా బ్రిగేడ్‎ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్‎ ఫైండ్‎ఔట్ చేసింది.

ఇక ఇందులో భాగంగా పాకిస్థాన్​ పెంచి పోషిస్తున్న ఉగ్రసంస్థ జైషే-మొహమ్మద్ బరితెగించింది. మహిళను ఉగ్రవాదులుగా మార్చేందుకు కొత్తగా ఆన్​లైన్​ కోర్సును ప్రారంభించింది. దీనికి “తుఫత్-అల్​-ముమినాత్​” అని పేరుపెట్టింది. జీహాద్ కోర్సు అని దాని అర్ధం. అంతేకాదు దీని ఫీజును 500 పాకిస్థానీ రూపాయలుగా నిర్ణయించింది. గత నెలలో బహవల్​పూర్​లోని మర్కజ్​ ఉస్మాన్ ఓ అలీలో జరిగిన బహిరంగ సమావేశంలో కనిపించిన మసూద్ అజార్​ ఇప్పుడు తన ఉగ్రవాద కార్యకలాపాల కోసం​ విరాళాలు సేకరించే పనిని ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే మహిళల కోసం ఒక ఆన్​లైన్ కోర్సు పెట్టి ఒక్కొక్కరి నుంచి 500 పాకిస్థానీ రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్​ పెంచిపోషిస్తున్న ‘జైషే-మొహమ్మద్​’ గ్రూప్​ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు “జమాత్​ – ఉల్​-ముమినాత్” అనే మహిళా విభాగాన్ని సృష్టించింది.​ అంతేకాదు తమ టెర్రర్​ గ్రూప్​నకు అవసరమైన నిధులు సేకరించేందుకు, నియామకాలు చేపట్టేందుకు, ముఖ్యంగా మహిళలను తమలో చేర్చుకుని ఉగ్ర శిక్షణ ఇచ్చేందుకు “తుఫత్-అల్​-ముమినాత్​” అనే ఆన్​లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో చేరిన వారికి జైషే-మొహమ్మద్ గ్రూప్​నకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదాలు శిక్షణ ఇస్తారు. అందులో ప్రధానమైనవాళ్లు జైషే-మొహమ్మద్​ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్​కు చెందిన బంధువులు, కమాండర్లు. వీరు మహిళలకు జీహాద్​ గురించి, ఇస్లాం గురించి బోధిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత ఆన్​లైన్​లో నియామకాలు చేపడతారు. నవంబర్​ 8 నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుంది అని సమాచారం.

కోర్సు ఎలా ఉంటుందంటే….ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ఉగ్ర పాఠాలు బోధిస్తారు. వీటిని అజార్​ సిస్టర్స్​ అయిన సదియా అజార్​, సమైరా అజార్​ బోధిస్తారు. వారు మహిళలు కచ్చితంగా ‘జమాత్​-ఉల్​-ముమినాత్​’లో చేరాలని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మసూద్ అజార్​ చెల్లెలు సదియా అజార్​కు ఈ విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం పాకిస్థాన్​లో మహిళలు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని భావిస్తుంటారు. అలాంటిది ఓ ఉగ్రసంస్థ నేరుగా మహిళల కోసం ఆన్​లైన్ జిహాదీ కోర్సు పెడితే, ఏమీ తెలియనట్లు కళ్లు మూసుకుని ఉంది. ఇది పాక్​ వక్రబుద్ధిని బయటపెడుతోంది.

మసూద్ అజార్​ అక్టోబర్​ 8న జమాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్​ 19న పాక్ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన మహిళలను తమ ఉగ్ర విభాగంలోని తీసుకువచ్చేందుకు ‘దుఖ్తరన్​-ఏ-ఇస్లాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదంతా చూస్తే మగ ఉగ్రవాదుల వల్ల కానిది, ఆడ ఉగ్రవాదులతో సాధించాలని మసూద్ అజార్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. Pakistan Jaish E Mohammed.

అయితే మహిళా బ్రిగేడ్‎ గ్రూప్ బాధ్యతలను మసూద్ అజర్ తన చెల్లెలు సాదియా, సమైరా చేతిలో పెట్టినట్లు సమాచారం. సాదియా భర్త యూసప్ అజార్, సమైరా భర్త ఉమర్ ఫరూక్ ఇద్దరూ కూడా ఉగ్రవాదులే. పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుడే ఈ ఉమర్ ఫరూక్. వీరిద్దరూ భారత సైన్యం చేతిలోనే హతం కావడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‎లో యూసప్, ఇండియన్ ఆర్మీ ఎన్ కౌంటర్లో ఉమర్ ఫరూక్ కుక్క చావు చచ్చారు. ఆత్మాహుతి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా జైషే ఈ మహిళా బిగ్రేడ్ ను ఏర్పాటు చేస్తోన్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు ఈ మేరకు అలర్ట్ అయ్యాయి.