
Khammam Wyra Roads: ఎవరైనా ప్రయాణించేటప్పుడు రోడ్డు మధ్యలో గుంతలు ఉన్నాయేమోనని చూసేవారు. కానీ ఇప్పుడు గుంతల మధ్యలో రోడ్డుఎక్కడ ఉందోనని చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోడ్ల పైన ప్రయాణం చేయాలంటే సర్కస్ లో కాస్త తరిఫీది పొంది ఉండాలి. లేదా బాగా విన్యాసాలు చేయడం తెలిసి ఉండాలి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారుల దుస్థితిపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతనడందో గుంతలమయమయ్యాయి. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండల కేంద్రం నుండి పొద్దుటూరు , కొనిజర్ల -రాజమండ్రి జాతీయ రహదారి, కొనిజర్ల మండలం పల్లిపాడు, మధిర ,జగ్గయ్యపేట వెళ్లే ప్రధాన రహదారులు వాహనాదారుల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. రాత్రి సమయంలో గుంతల కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్డంలో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని సీపీఎం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం విమర్శించారు. రాత్రి సమయంలో గ్రామాలకు వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. గుంతల విషయం తెలియని కొత్తగా గ్రామాలకు వస్తున్న అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్లకు మరమత్తులు చేయించాలని కోరుతున్నారు.
గుంతుల్లో వాహనాలు నడిపేందుకు యుద్ధమే చేయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అధికారులు సమన్వయంతో వ్యవహరించి రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. నెలలు తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. గుంతలను పూడ్చడం ద్వారా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. వర్షాలు తగ్గడంతో ఇప్పుడే మరమ్మతులు చేపడితే మరోసారి భారీ వర్షాలు వచ్చిన ఇబ్బందులుండవని చెబుతున్నారు. Khammam Wyra Roads.
ఈ జాతీయ ,ప్రధాన రహదారులపై మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఉన్నతాధికారులు నిత్యం ప్రయాణం సాగిస్తున్నారు. . అయినా ఇంత అధ్వానంగా ఉన్న ఈ రోడ్ల దుస్థితి కంటికి కనిపిస్తున్న కళ్ళు లేని కబోదులుగా వ్యవహరించడం సిగ్గుచేటని,పేరుకి స్థానిక ముగ్గురు మంత్రులు ఉన్న రోడ్లు మాత్రం బాగుపడలేదని వ్యవసాయ కార్మిక సంఘం వైరా మండల కార్యదర్శి సుధాకర్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ రోడ్లకు మరమ్మతులు చేయించి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.