
The moving mountains: గాలి కదులుతుంది, నీరు కదులుతుంది. కానీ.. పర్వతం కదలడం ఎవ్వరు విని ఉండరు. కానీ ప్రపంచంలో అలాంటి పర్వతం నిజంగానే ఉంది. అవును ఇది నిజం. ఈ పర్వతం ప్రతి సంవత్సరం కదులుతూ ఉంటుంది. మీకు వినడానికి ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. ఇంతకు కదులుతున్న పర్వతం ఎక్కడుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ.
ఆఫ్రికా ఖండం ఒక అద్భుతం. ఎన్నో వింతల నిలయం. కరవు కాటకాల వల్ల పేద ఖండంగా ఉండిపోయింది కానీ.. మానవ ఆవిర్భావానికి కేంద్రం ఈ ఖండమే అంటారు. అది అలా ఉంచితే.. ఈ ఖండంలో తూర్పు వైపున టాంజానియా దేశం ఉంది. ఈ దేశం పెద్దగా వార్తల్లో కనిపించదు. ఎందుకంటే.. ఇదో సైలెంటుగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశానికి తూర్పున హిందూ మహా సముద్రం ఉంది. అందువల్ల అందమైన బ్లూ బీచ్‌లు కలిగి, విదేశీ పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ మన పాయింట్ అది కాదు. ఈ దేశంలో కదిలే పర్వతం ఉంది. దాని విశేషాలు తెలుసుకుందాం.
పర్వతం కదులుతుందంటే ఏ లోకంలో ఎవ్వరు కూడా నమ్మరు. భూకంపాలు వచ్చినప్పుడే పర్వతాలు కదలుతాయి. కానీ టాంజానియాలో ఆ పర్వతం తీరే వేరండి. అది కదులుతుంది. దేనివలనే అంటే గాలి వల్ల ఆ పర్వతం కదులుతూ ఉంది. అది కదలడం వల్ల ప్రజలకు భూకంపం లాంటి సమస్యలేవీ రావు. కానీ వారి కళ్ల ముందే ఉండే పర్వతం క్రమంగా దూరం అవుతూ ఉంటే ప్రజలకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ వింత ఎక్కడ అంటే ఎన్‌గోరోంగోరో కన్జర్వేషన్ ఏరియా లో జరుగుతోంది. పగులు లోయకు దగ్గర్లో పూర్తిగా ఇసుకతో ఉన్న పర్వతం ఉంది.
దాన్ని బ్లాక్ వోల్కానిక్ ఆష్ డ్యూన్ అంటారు. ఈ ఇసుక పర్వతం 10 మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రతి సంవత్సరం 15 నుంచి 20 మీటర్లు కదులుతూ వెళ్తుంది. ఈ ఇసుక తిన్నె.. ఇప్పటికీ ఆగకుండా కదులుతోంది. ఇది మామూలు ఇసుక పర్వతం కాదనీ.. దీనికి దైవ శక్తులు ఉన్నాయని మాసాయి గిరిజనులు నమ్ముతారు. వారు ఇక్కడ ప్రత్యే జాతరలు, పండుగ సమయంలో ఈపర్వతానికి పూజలు చేస్తారు. ఇది ఓ పవిత్రమైన పర్వతంగా భావిస్తారు.
అసలు ఈ ఇసుక పర్వతం ఏర్పడిన విధానం ఒక ఆశ్చర్యమనే చెప్పుకోవాలి. ఈ పర్వతానికి దగ్గర్లో దేవుడి పర్వతం అనే అగ్నిపర్వతం ఉంది. అది ఇప్పటికీ యాక్టివ్ గానే ఉంది. ఆ పర్వతం బద్ధలైనప్పుడు.. దాని నుంచి మ్యాగ్నెటిక్ బూడిద వచ్చింది. అదే ఈ ఇసుక పర్వతంగా మారింది. ఈ బూడిద, ఇసుక పర్వతంలో ఇనుము మినరల్స్ ఉన్నాయి. ఇవి మ్యాగ్నెటిక్ లక్షణాలు కలిగివున్నాయి. అందువల్ల ఈ పర్వతం చూడటానికి పూర్తి ఇసుకలా ఉండదు. అక్కడక్కడా నల్లని మ్యాగ్నెటిక్, ఇనుము రజను కలిగి ఉంటుంది.
ఇసుక పర్వతం దగ్గర తరచూ ఈదురు గాలులు వస్తూ ఉంటాయి. అందువల్ల పర్వతం ఇసుక.. క్రమంగా పక్కకు జారుతూ ఉంటుంది. అలా.. ఒక చోట ఉన్న ఇసుక.. మరో చోటికి వెళ్తూ.. క్రమంగా పర్వతం మొత్తం కదులుతున్నట్లు అవుతోంది. ఈ కదలిక మామూలుగా చూస్తే కనిపించదు. కానీ ఇప్పుడు ఓసారి చూసి.. ఓ పదేళ్ల తర్వాత మళ్లీ చూస్తే.. అప్పుడు పర్వతం కదిలిన తేడాని గుర్తించగలం. 3000 సంవత్సరాల కిందట ఈ పర్వతం ఏర్పడింది. 1969 నుంచి NCA అధికారులు దీన్ని ట్రాక్ చేస్తున్నారు, ప్రతి సంవత్సరం బీకన్‌లు పెట్టి దూరాన్ని కొలుస్తుంటారు.
ఎంత దూరం కదిలింది అని. ప్రజెంట్ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం 1-20 మీటర్లు ఈ ఇసుక తిన్నె కదులుతోంది. కొంకాలంగా ఈ పర్వతం.. దగ్గర్లో నదులు ఉన్న వైపు కదులుతోంది. దిశను మార్చుకుంటోంది. ఇలా ఎందుకు అని 2001లో గమనించగా.. పర్వతంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల.. నదుల వైపు వెళ్తోందని గుర్తించారు. అంటే భవిష్యత్తులో ఈ పర్వతం.. నదుల్లో కలిసిపోవచ్చు. నది నీటి ప్రవాహంలో.. ఇసుక కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఐతే.. ఆ పర్వతం మాయమైనప్పుడు.. భూమికి చెడు జరుగుతుందనీ, యుగాంతం లాంటిది వస్తుందని స్థానికులు నమ్ముతున్నారు.
ఈ పర్వతాన్ని దైవ శక్తి ఉన్న పర్వతంగా స్థానికులు భావించడానికి బలమైన కారణం ఉంది. ఎవరైనా ఈ పర్వతం దగ్గర చేతుల్లోకి ఇసుక తీసుకొని.. గాలిలోకి ఎగరేస్తే.. అది తిరిగి పర్వతం పైనే పడుతుంది. ఎవరైనా పర్వతానికి వ్యతిరేక దిశలో ఇసుకను ఎగరేసినా.. అది మళ్లీ పర్వతాన్నే చేరుతుంది. ఎందుకంటే.. ఆ ఇసుకలో ఎక్కువశాతం మ్యాగ్నెటిక్ రేణువులే ఉంటాయి. పర్వతంలో ఆకర్షణ శక్తి వాటిపై ప్రభావం చూపుతుంది. కానీ.. మాసాయి గిరిజనులు ఈ సైంటిఫిక్ కారణాన్ని ఒప్పుకోరు. అగ్ని పర్వతం నుంచి వచ్చిన.. దైవ శక్తి గల పర్వతంగా దీన్ని నమ్ముతారు. అప్పుడప్పుడూ దీని ముందు ప్రార్థనలు కూడా చేస్తుంటారు. The moving mountains.
ఈ పర్వతాన్ని 1973లో కిలిమంజారో జాతీయ ఉద్యానవనంలో చేర్చారు. ఏడు శిఖరాలలో ఒకటిగా , కిలిమంజారో ఒక ప్రధాన హైకింగ్ మరియు క్లైంబింగ్ గమ్యస్థానం. పర్వతం యొక్క ఎత్తైన ప్రదేశమైన ఉహురు శిఖరానికి ఏడు స్థిరపడిన మార్గాలు ఉన్నాయి . ఇలాంటి పర్వతాల వలె సాంకేతికంగా సవాలుగా లేనప్పటికీ, కిలిమంజారో యొక్క ప్రాముఖ్యత ఎత్తులో తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది
1961 నుంచి 2011 వరకు ఈ పర్వతం 1 కిలోమీటర్ కదిలింది. 1981లో రెండు భాగాలుగా విడిపోయింది. కానీ పూర్తిగా విడిపోలేదు. 1991లో ఆకారం కొంత మారింది. 2001లో దిశ మారింది. టాంజానియాకి వచ్చే వారు.. అక్కడి ప్రకృతి ఆందాలు, బీచ్‌లతోపాటూ.. ఈ ఇసుక తిన్నెను కూడా చూసేందుకు వస్తారు. దీని ప్రత్యేకతలు తెలుసుకుంటారు. ఇలా ఈ పర్వతం.. ప్రపంచ పర్వతాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది టాంజానియాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.