మినిస్ట‌ర్ క్రికెట‌ర్లే..!

Spread the love

Indian Cricket Ministers: దేశంలో మూడు రంగాల‌లో రాణించిన‌వారు ఫేమ‌స్ అవుతారు. అవి రాజ‌కీయాలు, సినిమా, క్రికెట్ లేదా ఏదైనా క్రీడ‌లు. ఇందులో సినిమా, క్రీడా రంగంవారు త‌దుప‌రి జ‌ర్నీ రాజ‌కీయాలు అయిన ఉదాహ‌ర‌ణ‌లు చాలా ఉన్నాయి. తాజాగా హైద‌రాబాదీ క్రికెట‌ర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్ తెలంగాణ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజ‌హ‌ర్ కంటే ముందే చాలామంది క్రికెట‌ర్లు ప‌లు రాష్ట్రాల‌లో మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ మాజీ క్రికెటర్లు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓ జాతీయ‌ క్రికెట‌ర్, దేశానికి కెప్టెన్ గా చేసిన వ్య‌క్తి మంత్రి కావ‌డం బ‌హుశా ఇదే మొద‌టిసారి. 2009లోనే అజ‌హ‌ర్ యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజ‌స్థాన్ లోని టోంక్ నుంచి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ త‌ర‌ఫున హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక రావ‌డం అజ‌హ‌ర్ కు క‌లిసొచ్చింద‌ని చెప్పాలి.

అజహరుద్దీన్ రాజకీయ ప్రస్థానం .. అజహరుద్దీన్ 2009లోనే యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్ నుంచి ఓటమి పాలయ్యారు. 2023లో కాంగ్రెస్ తరఫున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగి పరాజయం చవిచూశారు. కానీ, ప్రస్తుతం అదే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడం, ఆయనకు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కనుండటం అజహర్‌కు కలిసి వచ్చిన పరిణామంగా చెప్పవచ్చు.

టీమ్ ఇండియాలో అజ‌హ‌ర్ కు స‌మ‌కాలికుడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ. సిక్స‌ర్ల సిద్ధూగా 1980ల్లో పేరుగాంచిన ఈయ‌న పంజాబ్ ప్ర‌భుత్వంలో 2017-19 మ‌ధ్య ప‌ర్య‌ట‌క శాఖ మంత్రిగా ప‌నిచేశారు. లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా వ్య‌వ‌హ‌రించారు.ఆయన పంజాబ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు మరియు మ్యూజియంల మంత్రిగా కూడా పనిచేశారు. సిద్ధూ 2004లో బిజెపి టికెట్‌పై అమృత్‌సర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2006లో నరహత్య ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత సిద్ధూ లోక్‌సభకు రాజీనామా చేశారు. 2009లో ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి సురీందర్ సింగ్లాను 77,626 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. సిద్ధూ 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మోడీ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో సిద్ధూను రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే, జూలై 18న ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. 2016 సంవత్సరం నవజ్యోత్ సింగ్ సిద్ధూ 2016 సెప్టెంబర్‌లో బిజెపికి రాజీనామా చేశారు. సిద్ధూ ఆవాజ్-ఎ-పంజాబ్ (AeP) అనే ఫ్రంట్‌ను ప్రారంభించారు. జనవరి 2017లో, సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేసి, 42,809 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

అతని ముద్దు పేరు “జాంటీ సింగ్”. అతని క్రికెట్ కెరీర్‌లో, అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనల కోసం ప్రజలు అతన్ని “సిక్సర్ సిద్ధూ” అని కూడా పిలిచేవారు. మరియు అతని అద్భుతమైన ఫీల్డింగ్ కోసం అతన్ని “జాంటీ సింగ్” అని పిలిచేవారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముజ్సే షాదీ కరోగి సినిమాల్లో ప్రత్యేక పాత్రలో మరియు ‘ABCD 2’లో అతిధి పాత్రలో కూడా కనిపించాడు. అతను పంజాబీ చిత్రం మేరా పిండ్‌లో కూడా నటించాడు.

బెంగాలీ తివారీ… ప్ర‌తిభావంతుడే అయిన‌ప్ప‌టికీ టీమ్ ఇండియాలో రెగ్యుల‌ర్ స‌భ్యుడు కాలేక‌పోయాడు మ‌నోజ్ తివారీ. ప‌శ్చిమ బెంగాల్ జ‌ట్టు త‌ర‌ఫున భారీగా ప‌రుగులు చేసిన తివారీ.. అటు టీఎంసీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉంటూనే ఇటు బెంగాల్ జ‌ట్టు సార‌థ్యం కూడా నిర్వ‌ర్తించారు. 2021లో ఎమ్మెల్యే అయిన తివారీ.. ఇప్ప‌టికీ మంత్రిగానే కొనసాగుతున్నారు.

టీమ్ ఇండియా త‌ర‌ఫున 40 టెస్టులు ఆడి.. ఒక్క సెంచ‌రీ కూడా చేయ‌కున్నా మంచి బ్యాట‌ర్ గా గుర్తింపు పొందారు చేత‌న్ చౌహాన్. దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్‌తో ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందారు. సునీల్ గావ‌స్క‌ర్ తో 1970, 80ల్లో ఎన్నో మ్యాచ్ ల‌లో ఓపెనింగ్ కు దిగిన చేత‌న్ చౌహాన్ యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. 2000 సంవ‌త్స‌రంలో క‌రోనాతో చ‌నిపోయారు. మరణించే సమయంలో, అతను సీనియర్ వెల్ఫేర్, హోమ్ గార్డ్, యార్డ్ మరియు సివిల్ సెక్యూరిటీ మంత్రిగా ఉన్నారు. Indian Cricket Ministers.

వీరు కాక, పలువురు క్రికెటర్లు చట్టసభలకు ఎన్నికైనా, మంత్రి పదవులు మాత్రం చేపట్టలేదు. క్రీడా మైదానం నుంచి రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టిన ఈ ఆటగాళ్లు తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తున్నారు.