డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

Spread the love

అమెరికన్ ప్రెసిడెంట్  డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్’ను ప్రదానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే గత 80 ఏళ్ల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ విదేశీయుడికి (నాన్-ఇజ్రాయెల్ సిటిజన్) ఇవ్వడం ఇదే తొలిసారి. అంతే కాకుండా శాంతి విభాగంలో అవార్డును ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జులై లో ఇజ్రాయెల్ తమ నిబంధనలను సవరించి మరీ విదేశీయులకు ఈ అవార్డు ఇచ్చేలా మార్పులు చేసింది. ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ డే  వేడుకలకు హాజరై ట్రంప్ ఈ అవార్డును స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూదు ప్రజలకు, ఇజ్రాయెల్ భద్రతకు ట్రంప్ చేసిన సేవలకు ఇది గుర్తింపు అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక ఈ అవార్డు దీనిపై స్పందించిన ట్రంప్.. ఈ గౌరవం తనను ఆశ్చర్యపరిచిందని, ఇజ్రాయెల్ గుర్తింపు పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.