అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ!

Spread the love

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.కాగా విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో (Section 307) వంశీని ప్రధాన నిందితుడిగా (A1) పోలీసులు చేర్చడంతో, అరెస్టు తప్పదని భావించిన ఆయన పరారైనట్లు సమాచారం.గత జూన్ నెలలో సునీల్ అనే వ్యక్తిపై దాడికి తన అనుచరులను ప్రేరేపించారనే అభియోగంపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ,న్యాయస్థానం నుండి ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారు.అయితే విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో జరిగిన మరో కేసు విచారణకు కూడా ఆయన గైర్హాజరయ్యారు.ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వంశీతో పాటు ఆయన అనుచరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.