భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సముపార్జన మండలి (DAC) నిన్న సుమారు రూ. 79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.ఈ భారీ ప్యాకేజీలో భాగంగా సైన్యానికి శత్రు లక్ష్యాలను ఛేదించే లోయిటర్ మునిషన్ వ్యవస్థలు, యాంటీ-డ్రోన్ రక్షణ కోసం తేలికపాటి రాడార్లను సమకూర్చనున్నారు.వైమానిక దళానికి అత్యంత శక్తివంతమైన ఆస్ట్రా ఎంకె-2 (Astra Mk-2) క్షిపణులు, స్పైస్ గైడెన్స్ కిట్లు అందనున్నాయి.ఇవి గగనతలంలో శత్రు విమానాలను సమర్థవంతంగా కూల్చివేస్తాయి.అలాగే నౌకాదళం కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ రేడియోలు (HF SDR) మరియు టగ్ నౌకలను కొనుగోలు చేయనున్నారు.మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారైన ఆయుధాలకే ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం, సరిహద్దుల్లో సవాళ్లు పెరుగుతున్న వేళ భారత సైనిక సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లనుందని తెలుస్తుంది.