వృద్ధాశ్రమానికి పవన్, ప్రభాస్ భారీ విరాళం గురించి వెల్లడించిన యాంకర్ సుమ కనకాల…!

Spread the love

తెలుగు సినీ హీరోల రెమ్యునరేషన్లపై తరచూ విమర్శలు వినిపిస్తున్నా,వారు నిశ్శబ్దంగా చేసే సేవా కార్యక్రమాలు వారి అసలు వ్యక్తిత్వాన్ని చాటి చెబుతున్నాయి.తాజాగా ఖమ్మం జిల్లాలోని ఒక వృద్ధాశ్రమానికి సంబంధించి ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ ఆశ్రమ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ అత్యంత కీలకమైన ఆర్థిక సాయం అందించారని ఆమె పేర్కొంది.ముఖ్యంగా ప్రభాస్ గురించి సుమ చెబుతూ…ఆయన కేవలం భవన నిర్మాణానికే కాకుండా, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధుల నెలవారీ భోజన, వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా తనవంతు సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.ఎలాంటి ప్రచారం కోరుకోకుండా, నిశ్శబ్దంగా ప్రభాస్ చేస్తున్న ఈ నిరంతర సాయం గురించి తెలిసిన నెటిజన్లు ఆయనను ‘నిజమైన డార్లింగ్’ అంటూ కొనియాడుతున్నారు. స్టార్ హీరోలు సమాజం పట్ల ఎంతటి బాధ్యతతో వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.