అభిమాని పెళ్లిలో సూర్య సడన్ సర్ప్రైజ్… ఆనందంతో షాక్ అయిన వధువు!

Spread the love

తమిళ స్టార్ హీరో సూర్య కేవలం సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.తాజాగా ఆయన తన వీరాభిమాని అయిన కాజల్ వివాహ వేడుకకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భార్యకు సూర్య అంటే ఉన్న ఇష్టాన్ని గమనించిన వరుడు అరవింద్, రహస్యంగా సూర్యను ఆహ్వానించారు.పెళ్లి జరుగుతున్న సమయంలో సూర్య వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఎంతో నిరాడంబరంగా వేదికపైకి రావడంతో, వధువు కాజల్ ఆనందంతో నోరెళ్లబెట్టి షాక్ అయ్యారు.తన ఫేవరెట్ హీరో కళ్లముందు ఉండటంతో ఆమె కన్నీళ్లు పెట్టుకోగా, సూర్య వారి దగ్గరకు వెళ్లి సాదరంగా పలకరించి, వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ‘రీల్ హీరో – రియల్ హీరో’ అనే ట్యాగ్‌తో వైరల్ అవుతోంది. షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ అభిమాని కోరికను గౌరవించి పెళ్లికి రావడంపై నెటిజన్లు సూర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.